నగరి, కాళహస్తి ఎమ్మెల్యేల అవినీతిని లోకేశ్ ప్రజల్లో పెడితే, సమాధానం చెప్పకుండా మనోభావాలు దెబ్బతిన్నాయని నాటకాలు ఆడితే సరిపోతుందా?
– టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్
“యువగళం పాదయాత్రలో పేదల జీవితాల్ని జగన్ రెడ్డి ఏవిధంగా ఛిద్రంచేశాడో, తన అవినీతి, అక్రమార్జనకోసం రాష్ట్రాన్ని ఏవిధంగా నాశనంచేశాడో, ప్రజలే స్వయంగా టీడీపీ యువనేత నారాలోకేశ్ కు తెలియచేస్తున్నారు. తమ భవిష్యత్ కు భరోసా కల్పించే నాయకు డు చంద్రబాబేనని, ఆయనకు తమబాధలు, కష్టాలు తెలియచేయాలని జనం లోకేశ్ కు మొ రపెట్టుకుంటున్నారు. టీడీపీప్రభుత్వం వస్తేనే తమబాధలు, కష్టాలు, కన్నీళ్లు పోతామని బలంగా విశ్వసిస్తున్నారు.
అవినీతిపై సమాధానం చెప్పకుండా, మనోభావాలు దెబ్బతిన్నాయంటే సరిపోతుందా?
పాదయాత్ర మొదలుపెట్టిన రోజునుంచీ నియోజకవర్గాలవారీగా స్థానిక వైసీపీఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను లోకేశ్ ప్రజల్లో ఆధారాలతోసహా ఎండగడుతున్నారు. కాళహస్తి ఎమ్మె ల్యే స్థానిక ఎమ్మార్వోతో కలిసి రూ.100కోట్ల విలువైన చెరువుని కబ్జాచేశాడని లోకేశ్ ప్రజల కు చెప్పాడు. దానిపై కాళహస్తి కామెడీస్టార్ మధుసూదన్ రెడ్డి స్పందించకుండా, ఆవుకథలు చెబుతున్నాడు.
కాళహస్తి ఎమ్మెల్యే రూ.2వేలకోట్లు కొట్టేశాడని లోకేశ్ జనంతోచెబితే, దానిపై ఎమ్మెల్యే బాధపడాలి..లేదా స్పందించాలిగానీ, అతని అనుచరుల మనోభావాలు దెబ్బతిన డం ఏమిటి? లోకేశ్ వి ఆరోపణలో, వాస్తవాలో ప్రజలకు చెప్పకుండా, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడంద్వారా వారి నాయకుడి అవినీతిని వైసీపీనేతలు, కార్యకర్తలే బహిరంగపరుస్తు న్నారు. నగరి నియోజకవర్గాన్ని రోజా ఆమె కుటుంబసభ్యులు ఎలా పీక్కుతింటున్నారో, ఆధారాలతో సహా లోకేశ్ ఆప్రాంతప్రజలకు తెలియచేశాడు. మండలాలవారీగా జరుగుతున్న దోపిడీని ప్రజలముందు పెడితే, దానిపై సమాధానంచెప్పకుండా మనోభావాలు దెబ్బతిన్నా యని ఆమె కూనిరాగాలు తీస్తోంది.
బాధ్యతాయుతమైన పౌరుడిగా, మాజీమంత్రిగా లోకేశ్ మీ అవినీతిని బయటపెట్టకూడదా? నిజంగా మీరు అవినీతిచేయకపోతే, చేయలేదని ప్రజల్లో కి వెళ్లి నిరూపించుకోండి.. అంతేగానీ డొంకతిరుగుడు ఉపన్యాసాలు, ఉత్తుత్తి ప్రెస్ మీట్లు అన వసరం. మీడియాముందుకొచ్చిన నగరి, కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేల అనుచరులు తమనాయకులు ఎలాంటి అవినీతిచేయలేదు.. చేస్తే ఎక్కడో చేశారో చెప్పాలని టీడీపీని, లోకే శ్ ని ప్రశ్నించకుండా, మాటమాటకు మనోభావాలు.. మనోభావాలు అంటూ నిన్న, మొన్న మల్లగుల్లాలు పడ్డారు.
లోకేశ్ చెప్పింది అవాస్తవమైతే… ప్రజల్లోకి వచ్చి వారిసచ్ఛీలతను నిరూపించుకోవడానికి రోజాకు, మధుసూదన్ రెడ్డికి ఎందుకు భయం?
లోకేశ్ చెప్పింది వాస్తవంకాకుంటే, తాము ఏంచేయలేదని చెప్పే ధైర్యం నగరి, కాళహస్తి ఎమ్మె ల్యేలు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. లోకేశ్ పాదయాత్రలో జనంలేరు…జనంలేరు అంటున్న రోజా ఒకసారి యువగళం యాత్రకు వస్తే వాస్తవాలు బోధపడతాయి. పాదయాత్ర కు వచ్చేముందు ఆమెఒకసారి కంటిపరీక్షలు చేయించుకొని వస్తే ఇంకామంచిది. కేబినెట్లోని మంత్రుల్లో 19మంది ఇప్పటివరకు యువగళం పాదయాత్రపై విషంచిమ్మారు. 151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 110మంది లోకేశ్ ని విమర్శిస్తూ, పాదయాత్రపై దుష్ప్రచారం చేశారు.
ఈ లెక్కన రాష్ట్రకేబినెట్, జగన్ రెడ్డి ఎమ్మెల్యేలంతా లోకేశ్ దెబ్బకు ఠారెత్తిపోతున్నారని అర్థ మవుతోంది. యువగళం పేరువినపడితేనే మంత్రులకు, వైసీపీఎమ్మెల్యేలకు తడిసిపోతోంది. 28రోజులకే వారు ఇలాఅయిపోతే, మొత్తం 400రోజులు పూర్తయితే ఏమవుతారోనన్న ఆం దోళన వారి అభిమానులు, కుటుంబసభ్యుల్లో ఉంది. 40ఏళ్ల యువకుడి అలుపెరగని పోరా టం వైసీపీని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమికొడుతుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. యువగళం పాదయాత్రలో జనంలేరు.. అంటున్నవారే పనిగట్టుకొని మరీ వాలంటీర్లకు ఆదే శాలు ఇచ్చి, జనం లోకేశ్ యాత్రకు వెళ్లకుండా చూడాలని ఎందుకు అంటున్నారు? వాలంటీర్లతో, బెదిరింపులతో, ప్రలోభాలతో యువగళాన్ని అడ్డుకోలేరని వైసీపీనేతలు, మంత్రులు ఎం త త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. మీకు, మీనాయకుడికి మిగిలింది 13నెలలు మాత్ర మే.. తరువాత మీరు ఎక్కడుంటారో..ఏంచేస్తారో ఎవరూ ఊహించలేరని తెలుసుకోండి.”