Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఉచ్చులో షర్మిల

-జగన్‌పై కుట్రలు
-రాజకీయాల కోసం దేనికైనా దిగజారే రకం

-ఊసరవెల్లిగా మారి ఆయన చెప్పిందే చేస్తున్నారు
-అవినాష్‌పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
-కోర్టు పరిధిలోని అంశాలపై ఎలా మాట్లాడతారు
-ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
-వైఎస్‌ పేరు చార్జిషీటులో చేర్చిన కాంగ్రెస్‌తో ఎలా జతకలిశారు
-తెలంగాణలో పార్టీ మూసేసి ఇక్కడ ఏం సాధించాలని వచ్చారు
-మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ధ్వజం

తాడేపల్లి: చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు పన్నుతూ వైఎస్సార్‌ కుటుంబంలో చిచ్చు పెడుతుందని, జగన్‌పైనా కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని వైసీపీ మహిళా నేత, మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడా రు. రాజకీయాలకోసం మీరు ఏమైనా చేస్తారా… షర్మిల ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని హితవుపలికారు. వైఎస్సార్‌ సమాధి దగ్గర కాంగ్రెస్‌ లిస్ట్‌ మీరు చదువుతుంటే చాలామంది హృదయాలు ముక్కలయ్యాయని, ఆయనను అవినీతిపరుడుగా చిత్రించి కేసులు పెట్టించి చార్జ్‌ షీట్‌లో చేర్చిన కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు చేరారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణాలో పార్టీ ఎందుకు పెట్టారు…ఎందుకు ఎత్తేశారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందని హితవుపలికారు. మీకు కోర్టులపై, వ్యవస్ధలపై నమ్మకం ఉంటే కోర్టు పరిధిలో ఉన్న వివేకా హత్యపై ఎలా మాట్లాడతారని, హంతకుడు అని అవినాష్‌పై ఎలా నిందలు వేస్తున్నారని ప్రశ్నించారు.

వ్యక్తిగత ఎజెండాతో జగన్‌పై నింద లు వేస్తున్నారని విమర్శించారు. అవినాష్‌పై ప్రచారం చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడిరచారు. ఆ రోజున జగన్‌, విజయమ్మకు వ్యతిరేకంగా నిలబడిన వివేకాను నిలపడంలో సునీత కుటుంబం ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా..అని ప్రశ్నించారు. ఈ రోజు మీ స్వార్థం కోసం ఏకమై స్క్రిప్ట్‌ ప్రకారం మాట్లాడుతున్నారని, చంద్రబాబో..మరొకరో ఇలా మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారని, వారి వలలో పడి మీరు పావులుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టని కాంగ్రెస్‌ దోషి కాదా అని ప్రశ్నించారు. ఏ కారణం చెప్పకుండా జగన్‌ను ఓడిరచాలని అంటున్నా రంటే మీ జెండా..అజెండా ఏంటో ప్రజలు గ్రహించారనేది మీరు తెలుసుకోవాలన్నారు. జగన్‌ను ఓడిరచాలనే ధ్యేయంతో పనిచేస్తున్న మీరు రేపు ఆయనను కూడా హంతకుడని కూడా అంటారు.. మిమ్మల్ని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. రాజకీయాలలోకి తను రావడం ఇష్టం లేదని వైఎస్సార్‌ చెప్పినట్లు షర్మిలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ మీరు ఓ ఇంటర్వ్యూలో చిన్నాన్న తనను ఎంపీ కావాలని కోరుకున్నారని చెప్పడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE