Suryaa.co.in

Telangana

పేదలంటే కేసీఆర్ కు పురుగులతో సమానం

– దొంగ మాటలు చెప్పేందుకు కేసీఆర్ మళ్ళీ వస్తాడు
– ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం రావి నూతల గ్రామ ప్రజలతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల ఏమన్నారంటే… వైఎస్సార్ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రి గా ఉన్నారు..5 ఏళ్లలో ఆయన పాలన పథకాలు ప్రతి గుండెను తాకాయి. ప్రతి గడపను తాకాయి. వైఎస్సార్ చనిపోయి 13 ఏళ్లు అయినా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నాడు.

కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే మీకు ఏం చేశారో ఆలోచన చేయాలి.రెండు సార్లు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.సున్నా వడ్డీ కి రుణాలు అన్నారు..ఇచ్చారా?కేజీ టూ ఫీజి ఉచిత విద్య అన్నారు..ఇచ్చారా?దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారా?రుణమాఫీ అన్నారు .రైతులకు మందు కట్టలు ఫ్రీ అన్నారు..ఇచ్చారా?నిరుద్యోగ భృతి అన్నారు ఇచ్చారా?. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.

వైఎస్సార్ మాట ఇచ్చారు..నిలబెట్టుకున్నారు. రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చి వైఎస్సార్ వెంటనే మాఫీ చేశారు. మాట ఇవ్వడం అంటే వైఎస్ఆర్ లా ఉండాలి.బంగారు తెలంగాణను కాస్త బ్రతుకే లేనిsharmila తెలంగాణగా మార్చారు.బంగారు తెలంగాణ కాస్త ..బార్ల తెలంగాణ..బీర్లు తెలంగాణగా మార్చారు. వైఎస్సార్ వ్యవసాయంపై ఇచ్చే సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టీ ముష్టి 5 వేలు రైతు బందు ఇస్తున్నారు. 5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా..? 5 వేలు ఇస్తే నే రైతులు కార్ల లో తిరుగుతారా..?

కేసీఆర్ పాలన ఒక దిక్కుమాలిన పాలన.పంట నష్టం జరిగితే రైతులను ఆదుకొనే దిక్కు కూడా లేదు. ఏ వర్గాన్ని కూడా కేసీఆర్ ఆదుకోలేదు. పేదలంటే కేసీఆర్ పురుగులతో సమానం. దళితులకు గౌరవం లేదు. కేసీఆర్ కనీసం దళితుడిని కూడా పక్కన పెట్టుకోలేదు.ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కనిపిస్తారు.

ఎన్నికలు దాటాక…మొహం కూడా చూపించడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అని వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయా .? దొంగ మాటలు చెప్పేందుకు కేసీఆర్ మళ్ళీ వస్తాడు. గాడిద కు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్థాడు. మంచి మంచి వాగ్ధానాలు ఇస్తాడు. ఈ సారి కేసీఆర్ ను నమ్మితే భవిష్యత్ మనల్ని క్షమించదు. మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే మన బిడ్డలు మనల్ని క్షమించదు. పాలకుడు అనే వాడు ప్రజల కోసం తపించే వాడు అయి ఉండాలి. పాలకుడు అనే వాడు ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్ష కలిగి ఉండాలి.

కేసీఆర్ కు ప్రజలకు మంచి చేయాలని లేదు.అందుకే ప్రజలు అప్పుల పాలు అయ్యారు. తెలంగాణ లో అప్పు లేని కుటుంబం లేదు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించాం.కేసీఆర్ పరిపాలన ఎలా ఉందో ప్రజలకు బాగా అర్థం అయ్యింది.ఇక్కడ ఉన్నది వైఎస్సార్ రక్తం.పులి కడుపున పులే పుడుతుంది..వైఎస్సార్ పేరును రాజన్న బిడ్డ నిలబెడుతుంది.మహిళలను ఆర్థికంగా నిలబెడతా.

మహిళ పేరు మీద పక్కా ఇల్లు.నిరుద్యోగుల కోసమే ఉద్యోగాల కల్పన మీద మొదటి సంతకం.ఎస్సీ ,ఎస్టీ,బిసి ల సంక్షేమం కోసం పని చేస్తాం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందే వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం. వైఎస్సార్ ను అమితంగా అభిమానించే వారి ఇంటి పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా ఎగరాలి.

LEAVE A RESPONSE