Suryaa.co.in

Andhra Pradesh

షర్మిల కొడుకు కల్యాణం..కమనీయం!

– ఘనంగా షర్మిల వారసుడి పెళ్లిసందడి
-సోషల్ మీడియాలో ఆకట్టుకున్న పెళ్లి, తలంబ్రాల వేడుక
-మేనల్లుడి పెళ్లికి మేనమామ జగన్ మిస్
-అంతా వచ్చారు.. అన్నయ్య తప్ప..

హైదరాబాద్: ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి- ప్రఖ్యాత క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కొడుకు.. ఏపీ సీఎం జగన్ మేనల్లుడు రాజారెడ్డి వివాహం, రాజస్థాన్లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు అన్ని పార్టీలకు చెందిన నేతలు, వైఎస్ బంధుమిత్రులంతా హాజరయ్యారు. మేనమామ, ఏపీ సీఎం జగన్ ఈ పెళ్లికి ముఖం చాటేయడం వైఎస్ బంధువర్గాల్లో చర్చనీయాంశపమయింది.

ఈ పెళ్లికి ఆయన హాజరుకాబోరని తాము ముందే ఊహించామని, వైఎస్ బంధువులు పెళ్లిలో చర్చించుకున్నారట. అయితే రాజకీయాలు-బంధుత్వాలను వేర్వేరుగా చూసే అలవాటు జగన్కు లేదని, ఆయన తన ప్రత్యర్థులను సైతం ప్రత్యర్థులుగానే చూస్తారని కొందరు బంధువులు వ్యాఖ్యానించారట. రాజారెడ్డి వివాహం అటు క్రైస్తవ-ఇటు హిందూమత ఆచారాల ప్రకారం జరినట్లు షర్మిల విడుదల చేసిన ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE