రేవంత్‌రెడ్డితో ఏపీ ఎన్నికల ప్రచారం

– ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్
– నిజమైన ‘సూర్య’ కథనం
– ఏపీలో ప్రచారానికి రేవంత్ రాకపై ముందే కథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. దీనిని ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ధృవీకరించారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌రెడ్డి వస్తారని ఆయన వెల్లడించారు. కాగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌రెడ్డితోపాటు.. డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ వంటి ప్రముఖులు రానున్నారని ఈనెల 10న ‘సూర్య’ వెబ్‌సైట్‌లో మొదలయిన ‘ఏపీలో కాంగ్రెస్ టార్గెట్ 20’ పేరుతో, ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.అటు కర్నాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తోపాటు, మరికొందరు మంత్రులు రాయలసీమలో ప్రచారానికి రానున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు ‘సూర్య’ కథనాన్ని నిజం చేస్తూ, ఏపీసీసీ చీఫ్ మాణిక్యం ఠాకూర్ మీడియాకు వెల్లడించడం విశేషం.

Leave a Reply