Suryaa.co.in

National

మహావృక్షం కింద బయటపడిన శివలింగం

అది తమిళనాడు రాష్ట్రంలోని ఇయ్యలూరు అనే గ్రామం. అక్కడ ఓ పెద్ద మహావృక్షం దశాబ్దాల నుంచి ఉంది. అయితే ఆ చెట్టు కింద శివలింగం ఉందని గ్రామస్తులను ఈమధ్యనే తెలిసిందట. దాంతో పొక్లయినరు తెప్పించి, ఆ చెట్టు వేర్లలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.


తవ్వకం సందర్భంలో తొలుత ఒక రాయి తగలడంతో, ఆ గ్రామస్తులు ఆనందంతో కేరింతలు వేశారు. ఆ తర్వాత చూస్తే లోపల పురాతన కాలం నాటి శివలింగం బయటపడింది. దానితో భక్తులు జాగ్రత్తగా దానిని బయటకు తీసుకువచ్చి, భక్తితో పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సాధువులు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చి హోమాలు నిర్వహించారు. ఇప్పుడిది త మిళనాడులో హాట్‌న్యూస్ మరి!

LEAVE A RESPONSE