Suryaa.co.in

Andhra Pradesh

వినాయక మండపాలకు అనుమతివ్వండి: కన్నా

విజయవాడ: వినాయకచవితి పండగపై జగన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై తక్షణం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నేతలతో కలసి, ఆయన గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఏ మతానికీ లేని ఆంక్షలు కేవలం హిందువులకే విధించడం వల్ల, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని కన్నా, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ రెండేళ్ల పాలనా విజయోత్సవాలు, మంత్రుల సభల్లో డాన్సులు, వైసీపీ ఎమ్మెల్యేల ఊరేగింపులకు లేని ఆంక్షలు, కేవలం హిందువుల పండగలపునే విధించడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వివరణ కోరాలని ఆయన గవర్నర్‌ను కోరారు. అధికార వైసీపీ పార్టీ హిందూ సాంప్రదాయాలను కించపరస్తూ హిందూ మతంపై చేస్తున్న దురాగతాలను ఖండిస్తూ, గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని మార్యదపూర్వకముగా కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో.. రాష్ట్ర కోశాధికారి సత్యమూర్తి , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, రాష్ట్ర వి హెచ్ పి కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, తురగా నాగభూషణం తదితరులున్నారు.

LEAVE A RESPONSE