Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమైనా నిందితులపై చర్యలు లేవు

– డీజీపీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ

రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమైనా నిందితులపై చర్యలు లేవు.వైసీపీ పాలనలో దళితుల ప్రాణ, మాన, ఆస్తులకు భద్రత లేకుండా పోయింది.పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయస్ధానాలు జోక్యం చేసుకుని డా. సుధాకర్ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించాయి.వేధింపుల వల్లే డా.సుధాకర్ చనిపోయారు.

వరప్రసాద్ కు శిరోముండనం చేసిన నిందితులకు ‎, చీరాలలో కిరణ్, చిత్తూరులో ఓం ప్రతాప్ చావుకి కారణమైన వారికి ఇంతవరకు ‎ శిక్ష పడలేదు. వైసీపీ నేతలు పోలీసులు కలిసి పనిచేస్తున్నారు. అమరావతి ఎస్సీ రైతులపై అక్రమంగా ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు పెట్టివేదించిన అధికారులపై చర్యలు తీసుకోమని హైకోర్టు సైతం ‎ఆదేశించింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని పదే పదే విచారణకు ఆదేశిస్తుంది. జూన్ 2019 నుంచి దళితులపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, తీసుకున్న చర్యలపై డీజీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి.

LEAVE A RESPONSE