ఎస్సీ ఎస్టీల పాత రుణ బకాయిల వసూళ్లు ఆపండి

– దశాబ్దాల సంక్షేమ పధకాలను ఆపేసిన ప్రభుత్వానికి
– పాత బకాయిలను వసూలు చేసే హక్కు ఎక్కడిది?
ఎన్ ఎస్ ఎఫ్ డి సి, ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి పథకాల కింద 90 కోట్లు వసూలుకు రంగం సిద్ధం చేశారు
– గోళ్ళూడగొట్టి వసూలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు
– కరోనా కష్టకాలంలో బడుగులపై పిడుగులా?
– అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

విజయవాడ ; రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ళ పాలనాకాలంలో ఎస్సీ , ఎస్టీలకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు జరపలేదని,దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు అమలు చేసిన 20 రకాల సంక్షేమ పథకాలను నిలిపివేసినట్లు అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలిపారు.

సోమవారం విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దమ్మిడీ ఇవ్వటం చేతకాని ప్రభుత్వానికి పాత ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్ ఎస్ ఎఫ్ డి సి, ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి పథకాల కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు నుంచి దాదాపు 90 కోట్ల రూపాయలు వసూళ్ళకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగొట్టిన కుబేరులను వదిలేసి, మొండి బకాయిల పేరుమీద పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వాలు నిరుపేదలు తీసుకున్న రుణాలను చెల్లించాలని ఆదేశాలు ఇవ్వటం దారుణమన్నారు. కరోనా కష్ట కాలంలో ఎస్సీ ఎస్టీ లు డబ్బులు ఎలా కడతారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పాత రుణాల వసూళ్లు ను ఉపసంహరించుకోవాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

Leave a Reply