క్రైస్తవ సంస్థల దేశ వ్యతిరేక కార్యకలాపాలపై ఫిర్యాదు

మతవ్యాప్తి పేరిట దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెండు క్రైస్తవ సంస్థలపై కేంద్రానికి ఫిర్యాదు అందింది. విశాఖపట్నానికి చెందిన ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, గత కొంతకాలంగా దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్నట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, కేంద్ర హోంశాఖకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయా సందర్భాల్లో చేపట్టిన ర్యాలీలో.. భారతదేశాన్ని ముక్కలు చేసి, క్రైస్తవదేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆ సంస్థ ప్రతినిధి ఈ. సంతోష్ కుమార్ చేసిన డిమాండ్లను ఎల్.ఆర్.పీఎఫ్ తీవ్రంగా పరిగణించింది.
అంతేకాకుండా పలు సందర్భాల్లో ఆలిండియా ట్రూ క్రిస్టియన్ ఫోరమ్ అధ్యక్షుడు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ఐన పీడీ సుందర్ రావు జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, భారత రాజ్యాంగాన్ని, దాని రూప‌క‌ర్త‌ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కించ‌ప‌రుస్తూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది. బైబిల్ యూనివర్సిటీ, విద్యార్థులకు దేశ‌వ్యతిరేక భావాజాలాన్ని నూరిపోస్తూ, వారిలో వేర్పాటువాద సిద్ధాంతాలను ప్రేరేపిస్తున్నారని, ఆ విద్యార్థులు స‌మాజంలోకి వెళ్లి ఈ ప్రమాదకరమైన సిద్ధాంతాలను వ్యాపింపజేసే అవకాశం ఉందని, తక్షణమే ఈ సంస్థల కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (NIA) ద్వారా విచారణ చేపట్టి , కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో కోరింది.
మైనర్ బాలికలపై అత్యాచారాలపై ఫిర్యాదు:
విశాఖపట్నంలోని ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అనుబంధ సంస్థ ఐన బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా (BOUI) డైరెక్టర్ పీడీ సుందర్ రావు కుమారుడు లాజరస్ ప్రసన్నబాబుపై, గతంలో బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డ ఆరోపణలు ఉన్నాయని, సాక్షాత్తు పీడీ సుందర రావు సైతం అత‌ని కుమారుడు ప్రసన్న బాబు అకృత్యాలను అంగీకరిస్తూ జాగ్రత్తలు సూచించారని, ఇప్పటి వరకూ ఈ అంశంపై ఎలాంటి చర్యలూ లేవని లీగ‌ల్ రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోరం, జాతీయ బాలల హక్కుల కమిషనుకు పంపిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలకు సంబంధించి గతంలో ప్రసారమైన వార్తల వివరాలను తమ ఫిర్యాదుతో పాటు కమిషనుకు సమర్పించింది.
బైబిల్ యూనివర్సిటీని నిషేధించండి: యూజీసీకి లేఖ
చట్టవిరుద్ధంగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ నడుస్తున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా సంస్థను తక్షణమే నిషేధించాలని, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ యూజీసీ కార్యదర్శికి లేఖ రాసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి ఎలాంటి గుర్తింపు లేకుండా జారీ చేస్తున్న బ్యాచిలర్, మాస్టర్, పీహెచ్దీ డిగ్రీలను రద్దు చేసి, ఇకపై ఇలాంటి డిగ్రీలు జారీ చేయకుండా చర్యలు చేపట్టాల్సిందిగా తమ లేఖలో కోరింది.
బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా (BOUI) అనేది ఒక క్రిస్టియన్ థియోలాజికల్ సంస్థ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ – 1956 కు విరుద్ధంగా పనిచేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి గుర్తింపు లేకుండానే బ్యాచిలర్, మాస్టర్స్‌, Ph.D డిగ్రీలను బహిరంగంగా ప్ర‌దానం చేస్తోంది.
యుజిసి చట్టంలోని సెక్షన్ 22 (1) ప్రకారం ఇది ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ సంస్థ తమ డిగ్రీలతో అనేక సంవత్సరాలుగా యువతను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ గుర్తింపు లేని గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్, Ph.D డిగ్రీలను ప్ర‌దానం చేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తూ, దీని కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి భారీ మొత్తాలను ఫీజుగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply