చేసిన దానిని కూడా చెప్పుకోక పోతే ఎట్లా రాహులూ ?

– సుంకర పద్మశ్రీ

రెండు రోజుల క్రితం ఈ అబ్బాయి రాహుల్ ను యాత్రలో కలిశాడు ప్రభుత్వ పాటశాల విద్యార్థి. తనకు ఉన్న పరిమిత వనరులతో ఉన్న టీచర్ సహాయంతో అత్యంత ప్రతిభ కనపరిచాడు. చదువులో అక్కడి కంటే గొప్పగా నేర్చుకోవాలి అంటే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల తరపున జరిగే ఆన్‌లైన్ తరగతులు మరియు సెమినార్స్ లకు అటెండ్ అవ్వాలి. వీడికి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్లాలని ఆశ… ఎంతో నేర్చుకోవాలి అని తపన. కానీ అందుకు తగ్గట్టు వనరులు లేవు. కొందాం అంటే ఇంట్లో పేదరికం. అదే విషయం రాహుల్ కు చెప్పాడు. వీడి ప్రతిభకు, మేధస్సుకు ముగ్ధుడైన రాహుల్ గాంధీ, తక్షణమే తన సొంత డబ్బుతో మంచి లాప్ టాప్ కొని, ఇవాళ ఉదయం ఆ పిల్లాడిని క్యాంప్ కు పిలిపించి గిఫ్ట్ ఇచ్చాడు… ఈ విషయం ఆ కుటుంబం బయట పెట్టే వరకు తెలియదు. రాహుల్ పేజ్ లో గానీ పార్టీ పేజ్ లో గానీ లేదు. అవతల చేయనివన్ని చేశాం అని చెప్తున్నారు. మనం చేస్తున్నవి చేసినవి చెప్పటం లేదు. కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియద్దు అనేది పాటిస్తున్నాము కాబట్టే ఇలా ఉన్నాం. ఏది ఏమైనా రాహుల్ మనసులు దోచేస్తున్నావయ్యా..

Leave a Reply