నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే.. చేతగాని ఇరిగేషన్ మంత్రి బ్రో సినిమా గురించి చెబుతాడు
– వీళ్లు మంత్రులా.. బుద్ధి, జ్ఞానం ఉన్నాయా?
– గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డికి మాత్రం రూ.600కోట్ల బిల్లులు క్లియర్ చేశారు
– మంత్రులు కాంట్రాక్టర్లు అయితే పనులు చేస్తారా?
– సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నిలిచిపోయిన గండికోట లిఫ్ట్ పనులు పరిశీలన తర్వాత విలేకరులతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
ప్రజెంటేషన్ వివరాలు:-
•సాగునీటి ప్రాజెక్టుల్ని విధ్వంసం చేస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికే నేను ఈ కార్యక్రమం చేపట్టాను.
• ఎవరు మంచిచేశారో, ఎవరివల్ల రాష్ట్రం మీరు నష్టపోయారో ప్రజలు తెలుసుకోవాలి.
• గండికోట రిజర్వాయర్ దుస్థితిచూశాక, భవిష్యత్ లో జరగబోయే నష్టంపై ప్రజలు ఇప్పుడున్న పాలకులపై యుద్ధమే చేయాల్సిన పరిస్థితి.
• కడప జిల్లాకు పెద్ద అసెట్ గండికోట, అమెరికాలోని గ్రాండ్ కేనన్ ను పోలి ఉండే గండికోటని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేలా టీడీపీప్రభుత్వం ప్రణాళికలు వేసింది.
• గండికోట ఫెస్టివల్ నిర్వహించి, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాం. ఒంటిమిట్ట శ్రీరామ దేవాలయాన్ని మరో భద్రాచలంగా మార్చడానికి కృషిచేశాను.
• రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీప్రభుత్వం రూ.68,293కోట్లు ఖర్చుపెడితే, వైసీపీప్రభుత్వం కేవలం రూ.22,165కోట్లు మాత్రమే పెట్టింది.
• భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించాము కాబట్టే ముందు చూపుతో పనిచేశాం.
• పోలవరం పూర్తిచేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటిసమస్యే ఉండదు. గోదావరి నీటిని అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు తరలించాలని పనిచేశాం.
• తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ఎవరి హాయాంలో ప్రారంభమయ్యాయో తెలుసుకోండి. కృష్ణదేవరాయల తర్వాత నీటిని అందించి రాయలసీమను ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమే.
• గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు తరలించి, శ్రీశైలంలోని 120 టీఎంసీల మిగులు నీటిని రాయలసీమకు తరలించాం.
• నల్లమల అడవుల్లో 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వితే 280టీఎంసీల గోదావరి నీరునేరుగా బనకచర్లకు తీసుకురావచ్చు.
• రాయలసీమకు నీళ్లు అందితే, ఈప్రాంతాన్ని దేశంలో మరే ప్రాంతమూ అధిగమించలేదు. మాట్లాడితే నా రాయలసీమ అంటాడు ఈ ముఖ్యమంత్రి. పైకి కథలు చెబుతాడు.. చేసేవన్నీ తప్పుడు పనులే.
• టీడీపీప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణానికి ఐదేళ్లలో రూ.12,441కోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2011కోట్లు ఖర్చుపెట్టింది. దీనికి ఏం సమాధానం చెబుతారు? ఆ సొమ్ముని కూడా స్వార్థప్రయోజనాలకు తగలేశారు.
• నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే, చేతగాని ఇరిగేషన్ మంత్రి బ్రో సినిమా గురించి చెబుతాడు. వీళ్లు మంత్రులా.. బుద్ధి, జ్ఞానం ఉన్నాయా?
• దక్షిణభారతదేశంలో అతితక్కువ వర్షపాతం నమోదయ్యేది కడపజిల్లాలోనే. సగటు వర్షపాతం 700మిల్లీమీటర్లే. పెన్నా, చిత్రావతి, కుందూ, సగిలేరు, పాపాఘ్ని, బహుదా, చెయ్యేరు వంటి నదులు ఈ జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో ఎక్కువ సాగు పెన్నా బేసిన్ పైనే ఆధారపడింది.
• జిల్లాలో మొత్తం భూమి 37.95 లక్షల ఎకరాలైతే, సాగులో ఉన్నది కేవలం 15.60లక్షల ఎకరాలే. నీటి సదుపాయం ఉన్నభూమి కేవలం 5లక్షల ఎకరాలే.
• మొత్తం 37.95 లక్షల ఎకరాలకు సక్రమంగా నీరు అందితే, జిల్లా రూపురేఖలే మారిపోతాయి. సాగునీరు కడపజిల్లాకు వరమనే చెప్పాలి.
• జగన్ రెడ్డి రివర్స్ నిర్ణయాలతో ఒక్క రాయలసీమలోనే 102 ప్రాజెక్టులు ప్రీక్లోజర్ అయ్యాయి. కడపజిల్లాలో 14 ప్రాజెక్టుల్ని ప్రీక్లోజర్ చేశాడు జీవో 365 తో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 198 ప్రాజెక్టుల్ని ప్రీక్లోజర్ చేశాడు. మరలా ఐదేళ్లపాటు టెండర్లు పిలవకుండా ప్రీక్లోజర్ చేసిన వీళ్లను ఏమనాలి?
• టీడీపీప్రభుత్వంలో రేట్లు పెంచకుండా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు జరిగేలా చేశాం. అవసరమైతే రాత్రిళ్లు ప్రాజెక్టుల వద్ద పడుకొని పనులు జరిగేలా చూశాను.
రాయలసీమలోని ప్రధాన ప్రాజెక్టుల స్థితిగతులు…
తెలుగుగంగ :
తెలుగుగంగ ప్రాజెక్ట్ మొత్తం ఆయకట్టు 1.08లక్షల ఎకరాలు. టీడీపీప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు పెట్టిన ఖర్చు రూ.504కోట్లు అయితే, వైసీపీప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.383కోట్లు. ఆయకట్టు పెంచడానికి ఈ నాలుగేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోతిరెడ్డిపాడు నీటి సామర్థ్యం పెంచి, ఆ నీటిని తెలుగుగంగకు తరలిస్తామన్న హామీని జగన్ విస్మరించాడు.
గాలేరు-నగరి సుజల స్రవంతి : మొత్తం ఆయకట్టు 1,55,000 ఎకరాలు. టీడీపీ హాయాంలో రూ.1546 కోట్లు ఖర్చుపెట్టి ఫేజ్ -1లో 84శాతం పనులు, ఫేజ్ -2లో 26 శాతం పనులు పూర్తిచేశాం.
వైసీపీ ప్రభుత్వం రూ.557కోట్లు ఖర్చుపెట్టింది. పనులు మాత్రం జరగలేదు. జూన్ 2020 నాటికి ప్రాజెక్ట్ పూర్తిచేస్తామన్న జగన్ హామీ ఎప్పుడు నెరవేరుతుంది?
గండికోట రిజర్వాయర్ : టీడీపీ ప్రభుత్వం 2017-18 నాటికే 12టీఎంసీల నీరు నిల్వచేయడానికి పనులు చేసింది. నిర్వాసితులకు రూ.665 కోట్ల పరిహారం ఇచ్చింది. రూ.128 కోట్లతో రహదారి నిర్మించింది.
నిర్వాసితులకు రూ.10లక్షలు, పునరావాసం కింద రూ.7లక్షలు, 5సెంట్ల ఇంటిస్థలం ఇస్తామన్న హామీలను జగన్ నెరవేర్చలేదు. పరిహారం అందక నిర్వాసితులు ఇప్పటికీ రేకుల షెడ్లలోనే మగ్గిపోతున్నారు. ఈ ప్రభుత్వం 300 మంది అనర్హులకు పరిహారం దోచిపెట్టింది.
గండికోట – సీ.బీ.ఆర్ : ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆయకట్టు 24వేల ఎకరాలు. 60వేల ఎకరాల స్టెబిలిటీ. ప్రాజెక్ట్ వ్యయం రూ.1744కోట్లు (6 దశల్లో నిర్మాణం)
వైసీపీ ప్రభుత్వహయాంలో ఫేజ్ -2లో 10 శాతం పనులు కూడా జరగలేదు. నాలుగేళ్లలో 27ఎకరాల భూసేకరణ చేయలేకపోయారు. అదీ వీళ్ల పనితనం. గండికోట నీటిని లిఫ్ట్ ద్వారా పైడిపాలెం సీబీఆర్ కు అందించవచ్చు. నాలుగేళ్లలో అదిచేయకుండా రూ.3,500కోట్ల కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు. రూ.2,600కోట్లతో గ్రావిటీద్వారా నీళ్లు తీసుకెళ్లడానికి కొండలు తవ్వేస్తున్నారు. ఈ పనులు అవసరమా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? రూ.3,500 కోట్లు ఇక్కడ దుర్వినియోగం చేస్తూ, మరోపక్క తన బంధువు, ఎంపీ కంపెనీకి రూ.5,300కోట్లతో గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీళ్లు తీసుకెళ్లే పనులు అప్పగించారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు చేయకుండా కేవలం తనమనిషికి రూ.5,300కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. జగన్ దోచిపెడుతున్న రూ.8,500 కోట్లతో, అదనంగా ఒక్క రాయలసీమలోనే 15వేల ఎకరాలకు బిందుసేద్యం ద్వారా నీరు అందించవచ్చు. ఇవి కాకుండా రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్ పేరుతో మరోదోపిడీకి తెరలేపారు.
అవుకు టన్నెల్ : టీడీపీప్రభుత్వం రూ.452కోట్లతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసింది. 22-09-2018న పనులు ప్రారంభించి, 20వేల క్యూసెక్కుల నీరు గండికోటకు అందించాం.
అవుకు ఎడమ సొరంగాన్ని 2020 నాటికి పూర్తిచేస్తానన్న జగన్ రెడ్డి, ఇంతవరకు ఎలాంటి పనులు చేయలేదు.
పింఛా ప్రాజెక్ట్ : మొత్తం ఆయకట్టు 3,773 ఎకరాలు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి, ప్రాజెక్ట్ మట్టి ఆనకట్ట కొట్టుకుపోయింది.
అన్నమయ్య ప్రాజెక్ట్ : మొత్తం ఆయకట్టు 22,500ఎకరాల. దీన్నికూడా ఇసుకమాఫియాతో బలితీసుకున్నారు. వరదనీరు ధాటికి 62మంది చనిపోయారు. మొత్తం రూ.6వేలకోట్ల నష్టం వాటిల్లింది. ఇంతవరకు జరిగిన నష్టంపై ఈ ప్రభుత్వం ఆలోచించలేదు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు గాలికి.. కొత్తప్రాజెక్టుల పేరుతో దోపిడీ…
జగన్ రెడ్డి పనులన్నీ పిచ్చిపనులే.
రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తిచేయని జగన్, కొత్త ప్రాజెక్ట్ కడతానంటూ దోపిడీకి తెరతీశాడు. రూ.12,000 కోట్లతో కొత్తగా 10 ప్రాజెక్టులు అంటూ డ్రామాలు మొదలెట్టాడు. పులివెందులకు నీళ్లంటూ రూ.3,556 కోట్లతో మొదలుపెట్టిన గండికోట-చిత్రావతి, గండికోట-పైడిపాలెం ప్రాజెక్టులు ఇప్పటికే అటకెక్కాయి. జీ.ఎన్.ఎస్.ఎస్ నుంచి హెచ్.ఎన్.ఎస్.ఎస్ (పులివెందుల చక్రాయపేట నుంచి కదిరిమీదుగా తంబళ్లపల్లికి నీటితరలింపు) పేరుతో మంత్రి పెద్దిరెడ్డికి రూ.5,036 కోట్ల పనులు అప్పగించారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డికి మాత్రం రూ.600కోట్ల బిల్లులు క్లియర్ చేశారు.
మంత్రులు కాంట్రాక్టర్లు అయితే పనులు చేస్తారా? అసలు ఈపనులు అవసరంలేదు? కేవలం దోపిడీ కోసమే చేపట్టారు. 10 శాతం పెండింగ్ ఉన్న హంద్రీనీవా కాలువ పనులు పూర్తిచేయకుండా కొత్త కాలువలు తవ్వారు. భైరవాని తిప్ప ప్రాజెక్ట్ పూర్తయితే రాయదుర్గం నియోజకవర్గానికి నీరు అందుతుంది. అది చేయకుండా అవసరంలేని పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఒకజబ్బు ఉంది. మంచిపని ఎవరుచేసినా ఆయన భరించలేడు.
అందుకే టీడీపీప్రభుత్వం ప్రారంభించిన, పనులు చేసిన ప్రాజెక్టుల్ని నాశనంచేశాడు. బ్రాహ్మిణి స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్నిసార్లు శంఖుస్థాపన చేశాడు? ఎప్పటికీ పూర్తిచేస్తాడు? కర్నూల్లో మేం విమానాశ్రయం నిర్మిస్తే ఈ పిచ్చివాడు తనపేరు పెట్టుకున్నాడు. తన తండ్రిపేరు కూడా తీసేసి తనపేరు వేసుకుంటున్నాడు. వీటిని ఏమంటారు.. పిచ్చిఅనక?
పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు వచ్చినట్టయితే, రాయలసీమ నీటి సమస్య పరిష్కారమయ్యేది. రిజర్వాయర్లు, చెరువులు నింపితే, ఐదేళ్లు కరువు వచ్చినా సమస్య ఉండేదు. ఎట్టిపరిస్థితుల్లో గోదావరి నీటిని బనకచర్లకు తీసుకొచ్చి, రాయలసీమను సస్యశ్యామలం చేయడమే నాకల. అది చేసి తీరతాను.
రౌడీయిజం చేయడం రాజకీయం కాదు.. ప్రజల్ని మెప్పించడమే రాజకీయం.
రాష్ట్రానికి ద్రోహం చేస్తూ, సిగ్గులేకుండా మంత్రులు ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. బాధ్యతలేని నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడితే నిజాలు అబద్ధాలు కావు. పోలవరం ఏజెన్సీలు మార్చవద్దని పీపీఏ చెప్పినా వినకుండా ఎందుకు ముందుకెళ్లారు? పీపీఏ ఛైర్మన్ లేఖరాసినా, వినకుండా ముందుకెళ్లిన దుర్మార్గులు, మూర్ఖులు నేనుచేసిన పనులు తప్పపడుతున్నారు. ఏజెన్సీలు మార్చి, మీరు ప్రాజెక్ట్ నాశనంచేస్తే దానికి మేం బాధ్యులమా?
40ఏళ్లుగా రాజకీయాల్లోఉన్నాను. ఎవరికీ భయపడను. వీళ్ల కథేంటో తేలుస్తాను. రౌడీయిజం చేయడం రాజకీయం కాదు..ప్రజల్ని మెప్పించడమే రాజకీయం. పోలవరంసహా అన్ని ప్రాజెక్టులు పూర్తయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అధికారం లోకి వచ్చిన తరువాత ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేలా పనులు పూర్తి చేస్తాం.