జమ్మూ, కాశ్మీర్ బిల్లుపై చర్చలో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జమ్మూ, కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ, డబుల్ మైనారిటీలైన ఎస్సీ, ఎస్టీ మహిళలతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సైతం ఆయా అసెంబ్లీలలో రిజర్వేషన్ కల్పించాలని వైఎస్సార్సిపి సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ను విస్మరించడం తగదని ఆయన అన్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోను బీసీ మహిళలకు స్థానం కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఈ బిల్లుకు మద్దతును ప్రకటించారు.