-జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజా సంక్షేమానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కృషిచేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. బుధవారం గుంటూరు, విద్యానగర్‌లోని ఎంపీ కార్యాలయం నందు గెలుపొందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిసారు. దాచేపల్లి జెడ్పీటీసీ మూలగుండ్ల కృష్ణకుమారి, అచ్చంపేట జెడ్పీటీసీ విజయప్రతాప్‌రెడ్డి, రాజుపాలెం జెడ్పీటీసీ దొంతిరెడ్డి సునీతారెడ్డి, బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి, వట్టిచెరుకూరు జెడ్పీటీసీ భీమినేని వెంకట లక్ష్మీ, అమరావతి మండలం, ఎండ్రాయి గ్రామ ఎంపీటీసీ దేవబక్తుని సాంబశివరావు, అమరావతి మండలం, లేమల్లె గ్రామ ఎంపీటీసీ షేక్ నాగూల్ మీరావళి కలసి ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ అభినందించారు. ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన ఈ గౌరవంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ ఆ«శయ సాధనకు కృషి చేయాలన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను నడిపించాలని సూచించారు.