Suryaa.co.in

Andhra Pradesh

భారత్‌ను విశ్వగురు చేయడం మోదీకే సాధ్యం: కన్నా

నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ మరియు సమర్పణ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా పాత గుంటూరు లోని పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణము నందు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంప్ నకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నరేంద్రమోదీ 20 సంవత్సరాల పదవి యోగం కలిగిన ఒకే ఒక వ్యక్తి.సంపూర్ణ జాతీయాభివృద్ది, పేదల కోసం అభివృద్ధి పధకాలు అమలు చేయడం గర్వకారణం.నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా భారత దేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భారతదేశం ప్రపంచంలోనే ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతిని పొందిందని గుర్తు చేశారు.ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత భారత్ కే దక్కిందన్నారు.కరోన నిబంధనలు పాటిస్తూ కోవిడ్ నివారణకు స్వస్తిపాలకలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా చేయడం కోసం ఆయన నిరంతరం చేస్తున్నటువంటి కృషికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ఆరోగ్య స్వయం సేవక్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ…నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని అందరికీ ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని మోడీ నమ్మారు కాబట్టి ప్రతిఒక్కరికి ఆరోగ్యం అందాలని ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని భారతదేశమంతా మొదలుపెట్టారని పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ ఆరోగ్యం అందించే విధంగా అమలు చేసారని, అదేవిధంగా మూడవ వేవ్ కరోనా నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలతో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని, ఈరోజు అన్ని దేశాల కంటే ముందుగా నరేంద్రమోడీ గారు 9 నెలల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చారని ఈవ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తున్నారని కావున ప్రజలు ఎటువంటి అపోహలకు తావు లేకుండా వ్యాక్సిన్ వేయించు కోవలసిందిగా కోరుచున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి
రఘునాథబాబు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర శివన్నారాయణ, కోస్తాంధ్ర డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల అరుణ,పొగతోట రమాకుమారి,మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజాముద్దీన్, సేవ మరియు సమర్పణ్ అభియాన్ జిల్లా కన్వీనర్ కో కన్వీనర్లు నీలం ప్రసాద్,మల్లాల లక్ష్మణ్, నేరెళ్ల మాధవరావు, ప్రధాన కార్యదర్శులు కుమార్ గౌడ్,రాచుమల్లు భాస్కర్,స్థానిక నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు,గురుదత్తు, పలకలూరి శ్రీనివాసరావు,ఈదర శ్రీనివాసరెడ్డి,కంతేటి బ్రహ్మయ్య,అనుమోలు ఏడుకొండలు గౌడ్,ఉయ్యాల శ్యాంవరప్రసాద్,మైలా హరికృష్ణ,బుజ్జిబాబు,పోలిశెట్టి రఘు,దేసు సత్యనారాయణ,కొర్రపాటి సురేష్,మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు నమ్రత, కరుణశ్రీ,నాగమల్లేశ్వరి, ఏలూరిలక్ష్మీ,సరోజిని, రమాదేవి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE