టీటీడీపై హైకోర్టు తీర్పు భక్తుల విజయం: ఎంపీ రాజు

టీటీడీ బోర్డు పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని హైకోర్టు సస్పెండ్ చేయడం మంచి పరిణామమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. టీటీటీ పాలకమండలి సభ్యుల నియామకంపై హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఈ కేసు రాబోయే రోజుల్లో కొట్టివేయ బడుతుందనే దాంట్లో అనుమానం లేదన్నారు. కేసుల వెనుక ఎటువంటి కుట్రలు లేవని, భక్తుల మనోభావాలను కాపాడడం కోసమే కేసు వేశారన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కి తగిన నిధులు లేవని, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో ఎవరిని నియమించకుండా వ్యాపారాలు చేసుకునే వారిని నియమిస్తున్నారని విమర్శించారు. భగవంతుడి సేవలో మంచివారిని నియమించాలన్నారు. టీటీడీ జాయింట్ ఈవో పోస్ట్ రాజ్యాంగ ప్రకారం ఉందని, కానీ.. అదనపు ఈవో పోస్టు లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ విధంగా టీటీడీ అదనపు ఈవోను నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీలో ఎన్నో లొసుగులు ఉన్నాయని, ఏ అపచారం జరిగిన స్వదేశీ సేన తరపున ధర్మ పరిరక్షణ కొరకు పోరాటం చేస్తామని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

Leave a Reply