అన్న‌య్య‌లా అండ‌గా ఉంటా

-వైసీపీ ల్యాండ్ మాఫియాకి బ‌లైన సుబ్బారావు కుమార్తె నిత్య‌కి నారా లోకేష్ హామీ

వైసీపీ ల్యాండ్ మాఫియా అకృత్యాల‌కు చేనేత‌వ‌ర్గానికి చెందిన సుబ్బారావు కుటుంబం బ‌లైపోయింది. వారి అమ్మాయి నిత్య అనాథ‌గా మిగిలింది. టిడిపి అధినేత చంద్ర‌బాబు ఆ అమ్మాయికి అండ‌గా నిలుస్తామ‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర నేతృత్వంలో బృందం సోమ‌వారం రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరం గ్రామానికి చేరుకుని నిత్య‌ని ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా నిత్య‌ని ఫోన్‌లో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. వైసీపీ నేత‌ల భూదాహానికి బ‌లైన మీ కుటుంబాన్ని తిరిగి తీసుకురాలేన‌ని, అండ‌గా నిలిచి ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. సొంత అన్న‌య్య‌లా ఎంత వ‌ర‌కైనా తానే చ‌దివిస్తాన‌ని హామీ ఇచ్చారు. అరాచ‌క ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, తెలుగుదేశం పార్టీలో కుటుంబ‌స‌భ్యురాలిగా మీ బాగోగుల‌న్నీ చూసుకుంటామ‌ని నిత్య‌కు ధైర్యం చెప్పారు.

Leave a Reply