Suryaa.co.in

Telangana

ఇందిరమ్మ పాలన అంటే హిందువులపై దాడులా?

– చెంగిచెర్లలో ముస్లింల దాడిని ఖండించాలి
-పిట్టల బస్తిని కాళీ చేయించేందుకే పథకం ప్రకారం దాడులు
-సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో ఘటన
– గర్భిణీ, స్త్రీలపై దాడి జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు
-పోలీసులు కళ్లెదుంటే విచక్షణారహితంగా దాడి చేసినా అరెస్టు చేయలేని దౌర్భాగ్యం
-హోలీ పండుగ లక్ష్యంగా హిందువులపై దాడులు
– బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పిన విశ్వహిందూ పరిషత్

ఇందిరమ్మ రాజ్యంలో హిందువులకు రక్షణ కరువైంది. ఇందిరమ్మ రాజ్యంలో అడుగడుగునా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హోలీ పండుగ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమైన హిందువులపై ముస్లింలు దాడికి దిగడం హేయమైన చర్య.

ఆదివారం రాత్రి మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల గ్రామం పిట్టల బస్తిపై ముస్లింలు దాడి చేయడం తీవ్ర దిగ్భ్రాంతికరం. కత్తులు, కర్రలు, మారనాయుధాలతో దాదాపు 300 మంది మూకుమ్మడిగా దాడికి దిగి హత్యాయత్నం చేయడం దుర్మార్గం.

ఈ దాడిలో ఓ గర్భిణీ స్త్రీ తీవ్రగాయాల పాలు కావడం.. మరో మహిళ తనకు తీవ్ర గాయమై గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటం.. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడటం ఆటవిక చర్య అని విశ్వహిందూ పరిషత్ మండిపడింది.

ఈ మేరకు సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ , రాష్ట్ర సహకార్యదర్శి భాను ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లిం మూకలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పోలీసులే సాక్షులు అని వారు పేర్కొన్నారు.

పోలీసుల కళ్ళెదుటే ముస్లిం యువకులు విచక్షణ కోల్పోయి హిందూ మహిళలపై, హిందూ యువకులపై దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దాడికి పాల్పడిన దుండగులను ఇప్పటికి కూడా అరెస్టు చేయకపోవడం.. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక చర్య అని వారు విమర్శించారు.

మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన వ్యక్తులపై స్టేషన్ బేలబుల్ కేసులు నమోదు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని పోలీసులను విశ్వహిందూ పరిషత్ నేతలు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో

కొనసాగుతున్నది తమ అనుకూల ప్రభుత్వమని దుండగులు కాలర్ ఎగరేసుకొని దర్జాగా తిరుగుతుంటే.. బాధితులు మరింత వణికిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

గాయపడ్డ బాధితులను విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర సహకార్య దర్శి భాను ప్రసాద్ , బజరంగ్దళ్ కార్యకర్తలు పరామర్శించి ధైర్యం చెప్పారు. హిందువుల జోలికి వస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పిట్టల బస్తిని కాళీ చేయించేదాకా దాడులు కొనసాగిస్తామని ముస్లిం యువకులు హెచ్చరిస్తూ భయభ్రాంతులకు సృష్టించారని విశ్వహిందూ పరిషత్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బస్తీ వాసులను భయభ్రాంతులను గురి చేసి ఇక్కడి నుంచి పారిపోయే విధంగా కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై పథకం ప్రకారం దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రంజాన్ హలీం బట్టీలను హిందువుల షాపుల ఎదుట బలవంతంగా నిర్వహిస్తుండటం.. ఇదేంటి అని అడుగుతే ఎదురు తిరిగి దాడులకు పాల్పడటం ముస్లింలకు అలవాటుగా మారిందని వారు పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో భాగ్యనగరం నడిబొడ్డులో ఉన్నటువంటి జగదీష్ మార్కెట్లో ఓ కస్టమర్ పై ముస్లిం యువకులు తీవ్రంగా దాడికి పాల్పడడం, అదేవిధంగా బెంగళూరులో జరుగుతున్న హిందూ వ్యతిరేక విధానాలను తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగడం చూస్తుంటే రజాకార్ల కాలం గుర్తొస్తుందని విశ్వహిందూ పరిషత్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైపోతుందని, బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెంగిచెర్ల పిట్టల బస్తీ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని , వారికి వైద్య సదుపాయం కల్పించి ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా పోలీసులు పక్షపాత ధోరణి వీడి చెంగిచెర్ల పిట్టల బస్తీని జిహాది మూకల భారీ నుంచి కాపాడాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు.

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం లోనే ఇంతటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వము ఉలుకు పలుకు లేకుండా వ్యవహరించడం క్షమించరాని నేరమని విశ్వహిందూ పరిషత్ నేతలు ఆక్షేపించారు.

LEAVE A RESPONSE