Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికలకు సమాయత్తం కావాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు

విజయవాడ: ఎన్నికలకు బిజెపి శ్రేణులును సమాయత్తం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. వెబక్స్ మాధ్యమం ద్వారా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కు ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో బిజెపి ఎన్నికల కు ఏవిధంగా సన్నద్ధం కావాలి అన్న అంశాలు వివరించారు. రాష్ట్రంలో ఉన్న అయిదు క్లస్టర్ లు గా విభజించారు.క్లస్టర్లు వారి గా నిర్వహించే కార్యక్రమాల్లో జాతీయ నేతలు హాజరౌతారు అని వివరించారు. బిజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూతనంగా తొలి సారి గా ఓటు వినియోగించే వారి కి ఓటర్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం ఏవిధంగా నిర్వహించాలి అనే విషయాన్ని వివరించారు.

పోలింగ్ బూత్ స్థాయి లో వాల్ రైటింగ్ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం పొడిగించిన నేపద్యంలో ఈకార్యక్రమంలో బిజెపి నేత లు పాల్గొనాలి అన్నారు.

అదేవిధంగా ఈనెల 22వ తేదీ న అయోధ్య లో బలరాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా రామమయంగా మారిన తరుణంలో అదే రోజు ద్విపాలంకరణ తదితర కార్యక్రమాలులో భక్తులు గా భాగస్వామ్యం అవుదాం.

అదేవిధంగా బిజెపి అనుబంధ మోర్చా ల కార్యక్రమాలు విజయవంతం చేసి ఎన్నికల కు సన్నద్దం అవుదాం అని పిలుపు ఇచ్చారు.

LEAVE A RESPONSE