ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు

– టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

ఓట్ల కోసం జగన్ నీచమైన స్ధాయికి దిగజారుతున్నాడు.టిడిపి అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని తాను చెప్పినట్లు అబద్ధపు మాటలు ప్రచారం చేయిస్తున్నాడు. జగన్ ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడి పేటియం బ్యాచ్ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చిల్లరపోస్టులు పెడుతుంది. కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటంపై తెలుగుదేశం పార్టీ తోపాటు, నేతలుగా మాకు ఎంతో గౌరవం ఉంది.

అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులు, అణగారిన వర్గాలపై దాడులు చేస్తూ జగన్ సైకో పాలన సాగిస్తున్నాడు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి ప్రజల్లో గందరగోళం సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలన్న కుట్రలు పన్నుతున్నాడు….

ప్రజలు జగన్ ను నమ్మే పరిస్ధితుల్లో లేరు… ఇలాంటి మహానుభావుడు అంబేద్కర్ ను తన తప్పుడు ప్రచారానికి వాడుకుంటున్నందుకు జగన్ సిగ్గుపడాలి. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.

Leave a Reply