Suryaa.co.in

Telangana

మృగాళ్ల అంగఛేదన చేయాలి: ప్రసూన

చిన్నారులపై హత్యాచారానికి పాల్పడే మృగాళ్ల అంగాన్ని ప్రజల సమక్షంలో ఖండించాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు. ఐఎస్‌సదన్‌లో మృగాడికి బలయిన చైత్ర కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్భయ చట్టాన్ని సవరించి, ఉరిశిక్ష అమలుచేసే వరకూ మృగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంలో దిశ చట్టం కూడా మహిళలను కాపాడలేకపోతోందన్నారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ఈ ప్రాంతంలో ఇంత అరాచకం జరిగినా, ఇప్పటిదాకా కేటీఆర్‌గానీ, పక్కనే ఉన్న హోంమంత్రి గానీ వచ్చి పరామర్శించకపోవడం బట్టి, వారికి హత్యాచారాలు చేసే వారిపై ఎంత సానుభూతి ఉందో స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకుని, బాధ్యుడైన వ్యక్తికి ఉరిశిక్ష విధించే వరకూ టీడీపీ విశ్రమించదని హెచ్చరించారు. నష్టపరిహారాలు బాధిత కుటుంమానికి చైత్రను తీసుకురాలేవని స్పష్టం చేశారు.టిడిపి కార్యకర్తలు అశోక్, వాహిద్, మల్లేష్, దుర్గారావు తదితరులు పాల్గోన్నారు.

LEAVE A RESPONSE