-. ఇప్పటి వరకు ప్రమాద ఘటనపై కేసు కూడా ఎందుకు పెట్టలేదు.?
-.ఎవరిని లోపలకు రానివ్వకుండా ఏం దాస్తున్నారు..?
-. నిపుణులతో కూడిన కమిటీ వేసి భద్రతతో పాటు ఖర్చు పై ఆడిట్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం
– సెక్రటేరియట్ నీ ఫామ్ హౌజ్ కాదు.సెక్రటేరియట్ ప్రజల ఆస్తి
-.400నుంచి 12వందల కోట్లకు పెంచి ఎందుకోసం ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి
– YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి
హైదరాబాద్; ఇటీవల నూతన సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం జరగడం బాధాకారం. రాష్ట్ర పరిపాలన సౌధంలో ఇలాంటి సంఘటన జరిగితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తగదు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సెక్రటేరియట్ లో అతి పెద్ద ప్రమాదం జరిగితే.. మాక్ డ్రిల్ అంటూ అబద్ధాలు చెప్పి, కప్పిపుచ్చుకోవాలని చూడడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వమే.. ఇలా అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించాలని చూడడం నీచమైన చర్య. ముఖ్యమంత్రి, మంత్రి స్థాయిలో ఉండి, ఇలాంటి బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూడడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం.
రూ.400 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు ఖర్చు పెంచి కట్టిన సెక్రటేరియట్ నిర్మాణంపై మొదటి నుంచి ప్రజలను అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ఉంది. కేసీఆర్ గారు కమీషన్ల కోసమే నిర్మాణ వ్యయాన్ని రూ.400 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు పెంచారు. ఏ ప్రాజెక్టుకైనా 10శాతం మాత్రమే వ్యయంలో తేడా వస్తుంది.కానీ మూడు రెట్ల వ్యయం పెంచి, నిధులు దోచుకోవాలన్న ఆలోచన కేసీఆర్ కు కలిగింది. సెక్రటేరియట్ నిర్మాణంపై లెక్కలతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
నాణ్యతలో డొల్లతనం..
సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం జరగడం.. పనుల్లో డొల్లతనాన్ని తెలియజేస్తోంది. నాణ్యత, పర్యవేక్షణ కరువై ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజంగానే అగ్ని ప్రమాదం జరిగితే.. బయటకు ఎందుకు చెప్పడం లేదు? రహస్యంగా దాచాల్సిన అవసరం ఏముంది? అఖిలపక్షాన్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదు? ఇది కేసీఆర్ గారి గడీనా? ప్రజల కోసం నిర్మించిన సెక్రటేరియట్టా? జనం సొమ్ముతో సెక్రటేరియట్ కట్టి, లోపలికి అనుమతించకపోవడంలో మర్మమేమిటి? సెక్రటేరియట్ నిర్మాణంపై, ప్రాజెక్టు వ్యయంపై నిపుణులతో కూడిన కమిటీ వేసి నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం