Suryaa.co.in

Andhra Pradesh

మమ్మల్ని వదలిపెట్టమని ఎస్పీకి జగన్ చెప్పాలా?

– నిమ్మల రామానాయుడు
మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు కోర్టు ఆదేశాల్ని కూడా లెక్క చేయకుండా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా మమ్మల్ని 48 గంటల పాటు పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఇది అక్రమని ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం చట్టవ్యతిరేకమని సెక్షన్ 14,19 కి విరుద్దమని దీనిపై ఎస్పీ, డీఎస్పీ సమాధానం చెప్పాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. పోలీసులు కోర్టు ఉత్తర్వులు సైతం దిక్కరిస్తూ ఇప్పటికీ కూడా మమ్మలి బయటకు వెళ్లనీయటం లేదు. ఇది కోర్టు ఆదేశాలను దిక్కరించడమే. కోర్టు ఇచ్చిన ఆర్దర్ చూపినా పోలీసులు మమ్మల్ని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కోర్టు ఆర్టర్ సీఐకి చూపిస్తే డీఎస్పీకి చెప్పాలన్నారు. డీఎస్సీకి చూపిస్తే ఎస్పీకి చెప్పాలంటున్నారు, ఎస్పీకి వాట్సాప్ లో పంపి ఫోన్ చేసినా స్పందించలేదు. మమ్మల్ని వదలిపెట్టమని ఎస్పీకి జగన్ చెప్పాలా? లేకపోతే పోలీసులు ఎందుకు వదలిపెట్టడం లేదు? పోలీసులు జగన్ రెడ్డి చెప్పినట్టు కాకుండా కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇప్పటికైనా పోలీసులు కోర్టు ఉత్తర్వులు గౌరవించి గృహనిర్భందం నుంచి మమ్మల్ని విడుదల చేయాలి. జగన్ రెడ్డి ఓటమి భయంతో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతున్నారు. పోలీసులు లేకుండా పోటీ చేస్తే వైసీపీకి ఒక్క కౌన్సిల్ సీటు కూడా రాదని నిమ్మల రామానాయడు అన్నారు.

LEAVE A RESPONSE