వివిధ రంగాలకు చెందిన మహిళలకు అల్ – మునీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
– కార్యక్రమాన్ని విజయంతంగా నిర్వహించిన లయన్ ఎమ్మెస్ ఇమామ్ బాషా”
భారత రత్న, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు,ప్రథమ తొలి విద్యా శాఖా మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మ దినోత్సవం సందర్భంగా లబ్బీపేట లోని అల్ మునీర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఛైర్మన్ మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగింది.
రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ లయన్ ఎమ్.ఎస్.ఇమామ్ బాషా మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణానందం పేట, మొహమ్మద్ నగర్,(లబ్బీపేట),మునిసిపల్ కార్పొరేషన్ ఉర్దూ స్కూల్స్ హెచ్.,ఎమ్.,లు శ్రీమతి రజియా సుల్తానా,అయేషా సిద్దీఖా లను సన్మానించారు.
రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్,ఎక్స్ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గౌ సియా బేగం, అష్రఫ్ మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్ అష్రఫ్ సయ్యిద్, సుమయ్య మునీర్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్,ఇన్ టి.వి.,ఛైర్మన్ ఇక్బాల్ ఆలీ,ప్రముఖ న్యాయవాదులు అబ్దుల్ మతీన్, ఖలీలుల్లా,డాక్టర్ రహిమాన్,రిటైర్డ్ ఐ.జి.,సత్తార్ ఖాన్,ప్రముఖ జర్నలిస్ట్ షఫీ అహ్మద్,ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ ఫిరోజ్ అహ్మద్,ఎన్. జీ. ఓ.,అసోసియేషన్ నాయకులు ఎమ్.డి.ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు..