Suryaa.co.in

Andhra Pradesh Telangana

పొంగూరు నారాయణ మరదలు కృష్ణప్రియకు రక్షణ కల్పించాలి

– ఆమెకు పొంగూరు నారాయణ వల్ల ప్రాణహాని
– ఏపీ డీజీపీ, గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు న్యాయమూర్తి, మహిళా కమిషన్ కు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు

మంగళగిరి: మాజీ మంత్రి నారాయణ నుంచి ఆయన మరదలు విష్ణుప్రియకు రక్షణ కల్పించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఏపీ గవర్నర్‌,డీజీపీలకు వినతిపత్రం సమర్పించారు. క్యాన్సర్‌ పేషెంట్‌ అయిన విష్ణుప్రియపై కనీస జాలి కూడా వేధించడం అమానవీయమని రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఒక మంత్రి, శాసనసభ్యుడు, విద్య సంస్థల అధినేతగా పనిచేసిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు రావడం చాలా సీరియస్ గా పరిగణించాల్సిన విషయంగా సమాజం భావించాలని,సమాజంలో ఒక మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజల ముందు గోడు వెళ్లబోసుకునే దీన స్థితిలో ఉండటం చూస్తే సమాజంలో మహిళల రక్షణ ప్రశ్నర్ధకంగా ఉందని,తనను చంపించే అవకాశం ఉందని ఆమె ఆరోపణలు చేయడం బాధాకరం అని,ఆవిడ కాన్సర్ బాధితురాలు కూడా అని,అటువంటి మహిళను నారాయణ వేధింపుల పర్వం పై దర్యాప్తు అవసరం అని డిజీపీకి ఇచ్చిన వినతిపత్రం లో వివరించారు.

ఆమె భర్త కూడా ఆమెకు మానసిక స్థితి బాగోలేదని ఆమె మాటలు పట్టించుకోవద్దని కొన్ని పత్రాలు ప్రజలకు చూపించడం అనుమానాస్పదంగా వుందన్నారు.మహిళల రక్షణ మనందరి బాధ్యత అని, ఆమెకు పొంగూరు నారాయణ వల్ల ప్రాణహాని కలగకుండా రక్షణ కల్పించాలని నవతరం పార్టీ నుండి డిజీపీ కి విజ్ఞప్తి చేయుచున్నదని తెలిపారు.

నారాయణ విద్య సంస్థల్లో చనిపోయిన విద్యార్థుల మరణాలపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుచున్నామన్నారు. పొంగూరు కృష్ణప్రియ హైదరాబాద్ లోని రాయ దుర్గం పోలీసులకు చేసిన పిర్యాదు పై కేసు నమోదు చేసియున్నారని,కేసు వివరాలు తెప్పించుకుని విచారించి తగుచర్యలకు ఆదేశించవలసిందిగా తెలిపారు.

నవతరం పార్టీ ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకుని ఆమెకు రక్షణ కల్పించాలని కోరుచున్నానని డిజీపీ కి తెలిపారు.క్యాన్సర్ పేషంట్ అయిన పొంగూరు కృష్ణప్రియ అనే మహిళకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా పార్టీలు చూడటం సరికాదని అన్నారు.

ఇదే అంశంపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కి కూడా లేఖలు రాసినట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.

LEAVE A RESPONSE