Suryaa.co.in

Andhra Pradesh

స్కిల్‌ అవినీతి ఆధారాలు చూపించరేం?

– అవినీతి ఆధారాలను ప్రజల ముందు ఉంచాలి

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెన్స్,డిజైన్ టెక్ పేరుతో 371 కోట్లకు అవినీతికి పాల్పడ్డారని సిఐడి ఆరోపించి వారిని జైలుకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వమేమో 371 కోట్ల అవినీతి జరిగిందని,సిఐడి చీఫ్ సంజయ్ గారు మాత్రం 271 కోట్ల అవినీతి జరిగిందని 52 కోట్లకు సిమెన్స్, డిజైన్ టెక్ దగ్గర సాఫ్ట్ వేర్ కొన్నారని రకరకాలుగా చెబుతున్నారు.

గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీలతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను చేపట్టుటకు 28-05-23 న ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొ నన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉన్నారా లేదా? వీరి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా? ఈ ప్రోగ్రాంకు అప్పటి క్యాబినెట్ తీర్మానం జరిగిందా లేదా? అసెంబ్లీలో తీర్మానం చేశారా లేదా? మరి అవినీతి జరిగి ఉంటే 2015 లో మొదలుపెడితే 2019 వరకు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 34 పాలిటెక్నిక్ కాలేజీలలో,6 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం40 సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు విద్యార్థులకు 2,13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన విషయం అబద్దమా ? అందులో ఇడుపులపాయలో ఉన్న IIIT కాలేజీ కూడా ఒకటని ఆరోజున వారి పేర్లు,ఆధార్ నెంబర్లు,మొబైల్ నెంబర్లు అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయని టిడిపి పార్టీ వారు చెబుతున్నారు.ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నవా లేదా? లేదా వారు అబద్ధాలు చెబుతున్నారా? ఆ లిస్టు ప్రకారం ఆ ట్రైనింగ్ సెంటర్ల కెళ్ళి వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు వివరించాలి .

371 కోట్ల అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. కాబట్టి సిఐడి అరెస్ట్ చేసిందని చెబుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న యంత్రాంగం ద్వారా ఈ డబ్బు ప్రభుత్వ ఖజానా నుండి ఎవరెవరికి వెళ్ళింది చివరకు ఎవరి దగ్గర చేరింది షెల్ కంపెనీలు చేరింది అంటున్నారు కదా ఏ షెల్ కంపెనీకి చేరింది ఏ బ్యాంక్ అకౌంట్ లో చేరింది అన్న వివరాలు ప్రభుత్వం సేకరించలేదా?సిఐడి సేకరించలేదా? ఈ వివరాలన్నీ సేకరించి ప్రజలకు తెలియజేయాలి.

ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2020లో అవార్డు ఇచ్చారు కదా! మరి ఆ అవార్డు తీసుకున్నప్పుడు అవినీతి జరిగిందని మీకు తెలియదా ? ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థ అయితే అగ్రిమెంట్ చేసుకొని విద్యార్థులకి ట్రైనింగ్ సౌకర్యం కల్పించిందో ఆ సిమెన్స్ కంపెనీ అప్పటి యండి సుమన్ బోస్ గారు ఢిల్లీలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి అవినీతి జరగలేదని కుండబద్దలు కొట్టారు. వారు మాట్లాడుతూ నా మీద రెండేళ్లుగా ఎంత వత్తిడి చేశారో నాకే తెలుసు అని అన్నారు.

అవినీతి జరిగి ఉంటే అది ప్రభుత్వం సొమ్ము.దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందే. లేదా విద్యార్థులకు నిజంగా ట్రైనింగ్ ఇచ్చి ఉండి వారు దానివలన లబ్ధి పొంది ఉద్యోగాలు పొంది ఉంటే దానికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి. ఈ విషయాలన్నీ నిజంగా ప్రజలకు తెలియాలంటే అఖిలపక్ష కమిటీ వేయండి.

వాస్తవ వివరాలన్నీ అఖిలపక్ష కమిటీ ద్వారా ప్రజలకు తెలిస్తే ఎవరు దోషులో, దొంగలో, ఎవరు అబద్ధాలు చెప్పారో ,ఎవరు అవినీతి చేశారో, ఎవరు ప్రలోభాలకు లొంగి లేని కేసులు బనాయించి చట్ట,రాజ్యాంగ వ్యతిరేకంగా చేశారో ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఈ పనిని అంతటినీ రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని నిజాలు నిగ్గు తేల్చాలి.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE