Suryaa.co.in

Features

శుభం..శోభ..శుభకృత్..

రెండు ఉగాదులు
కరోనా నీడలో..
ఉపశమన వేళ
ఇదిగిదిగో శుభకృత్..
మహమ్మారికి వీడ్కోలు చెబుతూ మంగళమై
సుమంగళమై..!

సరే..మానవ జీవితమే పోరాటాల మయం..
మనుగడకు అనుకూలంగా..
మరణానికి వ్యతిరేకంగా..
యుగాల తరబడి ఇదే ఒరవడి
కనిపించే శత్రువులతో..
కనిపించని క్రిములతో…
గత రెండేళ్ల నుంచి కరోనాతో..
చలోనా చలోనా అంటూ..!
అప్పుడూ..ఇప్పుడూ..
ఎప్పుడూ..బాధలతో..
ఎన్నికల పేరిట
కొని తెచ్చుకున్న కష్టాలతో..!

శార్వరి మొత్తం వర్రి..
బ్రతుకులకు కొర్రి..
శార్వరి అంటే చీకటి..
ఇంతకు మునుపేడాది
అధిక భాగం
లాక్డవున్ చీకట్లలో…
తర్వాత ప్లవ..
శుభాలను మోసుకుంటూ..
ప్లవ అనగా దాటించేది..
కరోనా రక్కసి గండం నుంచి మానవాళిని గట్టెక్కించిన వత్సరం..శుభ సంవత్సరం..
మనుషులెల్లరు వాక్సిన్ ఆయుధం ధరించి..
మాస్కు రక్షణతో
భయాన్ని జయించి..
సామాజిక దూరంతో
మహమ్మారిని ఎదిరించి
నిబంధనల కవచంతో
పాడేసినట్టే కరోనాకి
చరమగీతం..
నేటి శుభకృత్
మానవ జాతికి
శోభకృత్..
ఈ ఉగాది నాందిగా
ఉందిలే మంచి కాలం
ముందు ముందూనా..!

శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE