– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధికారం కోసం ఇచ్చిన హామీలు అమలు చేయ చేతగాక ప్రజల ముందు జీరో అయ్యాడు. అనుకోకుండా వచ్చిన అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీతో అంటకాగుతున్నాడు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
రేవంత్ వ్యవహారశైలి నచ్చక అటు అధిష్టానం దగ్గరకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్టేషన్ లో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. పెద్దవారిని తిడితే పెద్దగా ఐపోతానని రేవంత్ భావిస్తున్నాడు. ప్రజాక్షేత్రంలో రేవంత్ జీరో .. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి పోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్, రేవంత్ జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి.
నమ్మి అధికారం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ ను దగ్గరకు రానివ్వడం లేదు. ఇక ప్రజలు ఎందుకు నమ్ముతారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ప్రజలు వెంటిలేటర్ మీద పడుకోబెట్టారు. తులసి తీర్థం పోసే సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయినట్లే. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే దింపుడుకల్లెం ఆశలే. ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాని ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి సారించాలి.