– వందలకోట్ల సినిమాకు టికెట్ రేటు పెంచిన పాలకులదా?
– వ్యవస్థను, పోలీసు-రాజకీయ నేతలను వివస్త్రను చేసిన సినిమాదా?
– ఆ సినిమాను ఓసారి అసెంబ్లీలో వేసుకుని చూడండి నాయకా..
(ఆర్పీ)
సినిమా ఇండస్ట్రీ చెప్తున్న హై బడ్జెట్ అంటే ఏమిటి?..దోపిడీ ఎలా చేస్తున్నారో!.,, ఒక్క సారి ఆలోచన చేయండి.
హీరో కి ఇచ్చే రెమ్యూనరేషన్ 300 కోట్లు!
దర్శకుడి రెమ్యూనరేషన్ 100 కోట్లు?
మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ 10 కోట్లు!.ఎలా?
ఇలా ఎవరికి,నచ్చినట్టు వాళ్ళు లెక్కలు వేసుకుని
భారీ బడ్జెట్ పేరుతో,దోచుకోవడం కాదా?
అసలు ఇక్కడ ప్రోడక్ట్ వేల్యూ కొలవడానికి ప్రమాణికత ఏదీ?
వాళ్ళు అడిగారు..మీరు పర్మిషన్స్ ,GO లు ఇచ్చేస్తున్నారు?.తప్పు ఎవరిది?
ఈ పర్మిషన్స్,G O ల జారీ వెనుక అవినీతి జరగడం లేదని చెప్పగలరా?
అసలు వాళ్ళు సినిమా తీశారు సరే,.అది గవర్నమెంట్ కి సంబంధం ఏమిటి?
సినిమా నిర్మాణ ఖర్చు విషయంపై ప్రభుత్వానికి ఎటువంటి జోక్యంఉండదు
అటువంటి సినిమాపై ప్రోత్సహకాల పేరుతో మీరు GO లు ఇచ్చి రేట్లు పెంచుకోవడానికి, అవకాశం ఇవ్వడం అంటే ప్రభుత్వం కూడా అవినీతి లో పాలుపంచుకోవడం కాదా? మీరు ప్రజల తరుపున ఉండాల్సింది పోయి,గుడ్డిగా GO లు ఇవ్వడం ఏమిటి?.
సినిమా బాగుంది,సామాజిక సృహ తో సినిమా తీశారు అని భావిస్తే, గవర్నమెంట్ పరిధిలో ఉన్న టాక్స్ రాయితీలు ఇవ్వచ్చు.అంతే గాని మీ పరిధిలో లేని, హద్దు అదుపూ,లెక్కలు లేని కమర్షియల్ సినిమాకు, ఇష్టమొచ్చిన రేట్లకు టికెట్ అమ్ముకోమని మీరు GOలు ఇవ్వడం అంటే, ప్రజలను దోచుకోవడం!
ఇది ఏరకమైన ప్రోత్సహకం?.ప్రభువులు చెప్పాలి. ఒక అభాగ్యురాలి మరణం,ఒక పిల్లవాడు బతకడానికి చేస్తున్న పోరాటం…మీరు ఇచ్చిన GO ఫలితం..
మీరు కనుక నిజమైన ప్రజా సేవకులు,ప్రజల శ్రేయస్సు కోరే వ్యవస్థలను నడిపిస్తున్నాము అని మీరు భావిస్తే, ఏ రాజ్యాంగాన్ని అయితే మీరు దైవంలా భావించి అతఃత్రికరణ శుద్దితో ప్రమాణం చేసి ఏ ప్రజల ఆకాంక్షలను, శ్రేయస్సును నెరవేర్చడానికి మీరు చట్ట సభలు నిర్వహిస్తున్నారో, అదే శాసనసభలో మీ,మీ అధికార, రాజకీయ అంతరాలు పక్కన పెట్టి, ప్రజల్లో ఇంతటి చర్చకు దారి తీసిన సినిమాను ఒక్కసారి చూడండి.
మీ రాజకీయ నాయకులను,వ్యవస్థలను ఎంత హీనంగా చూపించి, ప్రజల దృష్టిలో మిమ్మల్ని వివస్త్రలను చేసాడో అర్ధమౌతుంది. మీకు నిజమైన ఆత్మగౌరవం, విజ్ఞత ఉంటే, .మీ రాజకీయ అంతరాలు పక్కన పెట్టండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. లేదంటే సమాజం దృష్టిలో సినిమా లో చూపించిన “దృశ్యాలు” నిజం అయ్యే అవకాశం ఉంది