Suryaa.co.in

National

ఇది మన మీడియాలో రాదు!

మన ది ప్రధానంగా వ్యవసాయ దేశం. ప్రపంచంలోని 750 కోట్ల జనాభాలో 130 కోట్ల జనాభా మన దేశంలోనే ఉన్నది. అందువల్ల మన ప్రజల ఆహార అవసరాలు మనమే తీర్చుకోవాలి. దీనికై నిరంతరం వ్యవసాయ ఉత్పాదకత పెంచుకుంటూ పోవలసిందే.

ఏటికేటికీ తగ్గుతున్న జలవనరులు, నీటి లభ్యత, రియల్ ఎస్టేట్ కు మారతున్న సారవంతమైన వ్యవసాయ భూములు వంటి సవాళ్ళను ఎదుర్కొంటూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కత్తిమీద సామే.
అటువంటి పరిస్థితులలో సమగ్ర/సమతుల్య ఎరువుల వాడకం ఒక ముఖ్యమైన అంశం. రసాయనిక ఎరువుల వాడకం లేని వ్యవసాయాన్ని ఊహించలేం.

ఈ ఎరువులలో ప్రధానమైనవి:

యూరియా (UREA).,
సూపర్ ఫాస్ఫేట్ (SSP).,
పొటాష్(MOP)
పై 3 ఎరువులు లేనిదే పంటలు పండించలేం.

ఆ ఎరువుల ఉత్పత్తి మన దేశంలో చాలినంత లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ విధంగా రైతుల కోసం దిగుమతి చేసుకున్న యూరియా 2004-2014 మధ్య UPA హయాంలో రైతులకు చేరకుండా వ్యాగన్లు వ్యాగన్లే నేరుగా పెద్ధ రసాయన పరిశ్రమలకు చేరిపోయేది.

ఇక్కడ మాత్రం యూరియా అందక రైతులు రోజుల తరబడి యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి చివరకు పోలీసుకాల్పులకు కూడా గురి అయ్యేవారు.
మోడీజీ 2014 తర్వాత రైతుల కోసం మనం కొనుగోలు చేసే యూరియా ఖచ్చితంగా Neem_Quoted UREA మాత్రమే అయి ఉండాలని ఖచ్చితంగా నిబంధన అమలు చేశారు. ఈ వేపపూత యూరియా రసాయన అవసరాలకు పనికి రాదు, అందువల్ల పక్కదారి పట్టే అవకాశమే లేదు.అదీగాక వేపపూత వల్ల వినియోగ సామర్ధ్యం కూడా పెరుగుతుంది. చీడపీడల సమస్య కూడా కొంతవరకు తగ్గుతుంది.
ఇక పోతే రెండవ ఎరువు సూపర్_పాస్ఫేట్: ఇది అన్ని పంటలకు అతి ముఖ్యమైన ఎరువు. కారణం దీనిలో భాస్వరం తోపాటు సల్ఫర్, కాల్షియం మరియు ఇతర మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి.
ప్రస్తుతం మనం దీనికోసమని ఒక బస్తా 1200/- పెట్టి DAP వాడుతున్నాం.,
అలా కాకుండా SSP బాగా అందుబాటులోకి వస్తే బస్తా 300/- కే దొరుకుతుంది. పంటను బట్టి ఎకరాకు 3 నంచి 5 బస్తాలు ప్రతి పంటకూ ఖచ్చితంగా వాడాల్సిందే.
ఈ ఎరువును కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.,
గనులలో లభించే Phosphate_Rock నుంచి ఈ ఎరువును తయారు చేస్తారు.
ఈ రాక్ ఫాస్ఫేట్ గనులు జోర్డాన్ దేశంలో ఎక్కువగా ఉన్నాయి.
మోడీజీ జోర్డాన్ రాజుకు “మేము మీనుండే రాక్ ఫాస్ఫేట్ ను కొనుగోలు చేస్తాము., మా మార్కెట్ పరిమాణం ఇంత, మా మార్కెట్ ను వదులుకుంటే మీరు నష్టపోయేది ఇంత..” అని లెక్కలు చెప్పి, తక్కువ రేటుకే రాక్ ఫాస్ఫేట్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇవన్నీ పచ్చి నిజాలు. భారతీయ రైతుల కోసం మోదీజీ మస్తిష్కం నుంచి ఆవిర్భవించిన ఈ వివరాలేవీ మన భారతీయ మీడియాలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. మేధావులమని చెప్పుకునే మేతావులూ మాట్లాడరు. కానీ ఇవి రైతుల కళ్లెదుట కనిపిస్తున్న పచ్చి నిజాలు.

– సిహెచ్.నాగార్జున

LEAVE A RESPONSE