Suryaa.co.in

Features

పంచాంగ పఠనం / శ్రవణం గౌరవాన్ని , పవిత్రతను దిగజారుస్తున్న పండితులు

గత చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం . పండితులు ఎవరికి ఎలా ప్రీతికరంగా ఉంటుందనుకుంటే అలా పంచాంగాన్ని చెప్పటం . నిన్న హైదరాబాదులో సంతోష్ కుమార్ శాస్త్రి గారు మరీ దిగజార్చారు .
KCR గారికి మూడో కన్ను ఉందని , ఎవరెవరు ఏమి చేస్తున్నారో చూస్తూనే ఉంటారని , పార్టీలు మారాలని అనుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని వంటి అసందర్భ , అపవిత్ర సందేశాలు ఇవ్వటం జరిగింది . ఏమయినా పదవులు ఆశిస్తున్నారేమో తెలియదు . దురదృష్టం.

నాకు మరో సంఘటన గుర్తుకొచ్చింది . ఒకప్పుడు ప్రవచకులు , పండితులు ఎంత హుందాగా , తమ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండే వారో !
N.T. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు . మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పంచాంగ పఠనం చేస్తున్నారు . స్వస్తి మంత్రం చెప్పాలి . ఆ మంత్రం ఇది .
స్వస్తి ప్రజాభ్యః పరిపాలనాయంతాం , న్యాయేన మార్గేన మహీం మహీశా , గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు .
ఈ మంత్రం పలుకుతూ శాస్త్రి గారు బ్రాహ్మణేభ్యః అని పలకవలసి వచ్చినప్పుడు కాస్త తటపటాయించారు . కారణం అందరికీ తెలిసిందే . NTR గారు బ్రాహ్మణ వ్యతిరేకి అనే వాదు ఉండేది .

అప్పుడు NTR గారే కలగచేసుకుని పలకండి ఆ మాటలను అని , బ్రాహ్మణ అంటే కులం కాదని , బ్రహ్మ ఙానం – బ్రాహ్మణ్యం కలిగిన వారెవరయినా బ్రాహ్మణులే అని వివరించారు .
పాలకులు , పండితులు , ప్రవచకులు అంత హుందాగా , సంస్కారవంతంగా ఉండేవారు . సంతోష్ కుమార్ శాస్త్రి గారికి పరిచయం ఉన్న వారు ఎవరయినా వారికి ఉద్బోధించటం చాలా అవసరం . సనాతన సాంప్రదాయాల పవిత్రతను వారే కలుషితం చేస్తే ఎలా ?! గర్హనీయం .

– వి.వి.సుబ్రహ్మణ్యం

LEAVE A RESPONSE