– కేజిఎఫ్ మైనింగ్ ను తలపించేలా ఇక్కడ దోపిడీ
– ఇక్కడ మైనింగ్‌లో దోపిడీ జరుగుతుంటే అక్కడ జగన్ పబ్జీ అడుతున్నాడు
– భీష్మించి కూర్చున్న సోమిరెడ్డి
– రుస్తుం, భారత్ మైకా మైన్ లో వైసీపీ గుండాల దోపిడీని నిరసిస్తూ రుస్తుం యజమాని విద్యాకిరణ్ తో కలిసి భీష్మించి కూర్చొని నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి
ఈ సందర్భంగా సోమిరెడ్డి ఏమన్నారంటే.. ఎటువంటి పత్రాలు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అధికార పార్టీ బందిపోటు దొంగలు 21 రోజులు గా రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ను వెలికితీత.. రోజు కు 4 కోట్ల భారీ దోపిడీ. కోర్టు జోక్యం చేసుకొని అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకొమని ఈనెల 7 వ తేదినా ఆర్డర్స్ ఇచ్చినా, ఇంత వరకు అధికారులు అక్రమ మైనింగ్ ఆపకపోవడం సిగ్గుచేటు.
ముఖ్యమంత్రి కి,మంత్రులకు ఇందులో వాటాలు వున్నాయి కాబట్టే మైన్స్, పోలీసులు అధికారులు ముందుకు రావడం లేదు..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏ1 ముద్దాయి, పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏ2. మంత్రి కాకాని వైసీపీ నాయకుడు పేర్నేటి శ్యాం ప్రసాద్ రెడ్డి పై చర్యలు తీసుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇప్పటివరకు దోపిడీ చేసిన నగదును వారి వద్ద నుంచి వసూలు చేయాలి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జి ఆడుతున్నాడని కేజిఎఫ్ మైనింగ్ ను తలపించేలా ఇక్కడ దోపిడీ జరుగుతుందన్నారు.