యువగళం సభకు పవన్ రావట్లేదు

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి : ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘20వ తేదీన పోలిపల్లి గ్రామంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. ఆ సభకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ పాల్గొంటారు. ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ సభకి 16 కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సభకి 6 లక్షలు మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నాం. వైసీపీ కౌట్ డౌన్ ప్రారంభమైంది.

వైసీపీలోని అనేకమంది టీడీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇది యువగళంలో భాగంగానే జరుగుతుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో మ్యానిఫెస్టో సిద్ధం కాకపోవడంతో ఈ సభకి పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. త్వరలో పూర్తి మ్యానిఫెస్టో సిద్ధమైన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యలో భారీ సభ నిర్వహిస్తాం. జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

Leave a Reply