– బద్వేలు లో జనసేనతో కలసి ప్రచారం చేసిన బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు
బద్వేలు లో ప్రజలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి. నీటి కోసం కేంద్ర నుంచి నిధులు వచ్చాయి. రాష్ట్రంలో వైసిపి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళిస్తుంది. బద్వేలు బస్తీ లా లేదు….గుంతల రోడ్లతో ప్రజలు కుస్తీ చేస్తున్నారు. టిడిపి శ్రేణులను కలిసి వారికి ఉన్నతమైన పదవులు ఇస్తాం. ఎన్నికల్లో సహకరించాలని వైసీపీ మంత్రులు కోరుతున్నారు. టీడీపీ శ్రేణులను కలిసినట్లు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి.
బిజెపి కి ఏజెంట్లు కూడా ఉండరని వైసీపీ నేతలు అంటున్నారు. స్వచ్చందంగా బీజేపీ తరపున ఏజెంట్లు గా కూర్చోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఓటర్లను వలేంటీర్ల ద్వారా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బద్వేలు అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థి ని అఖండ మెజారిటీ తో గెలిపించాలి. మంత్రి పెద్దిరెడ్డి బద్వేలు అభివృద్ధి పై చర్చకు రావాలి.
పాలన ఇంట్లో నుంచి కొనసాగిస్తున్న జగన్: ఆదినారాయణ రెడ్డి
బద్వేలు లో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పాలన ఇంట్లో నుంచి కొనసాగిస్తున్న జగన్. రాష్ట్రంలో దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేయాలని వైసీపీ చూస్తుంది. ప్రజా స్వామ్య పద్దతిలో ఎన్నిక జరగాలి.బద్వేలు ఉప ఎన్నికలో మంత్రులు హడావిడి చేస్తున్నారు. పోలీసులను, వలంటీర్ల ను అడ్డుపెట్టి ఎన్నికలు జరపాలని వైసీపీ చూస్తుంది. కేంద్ర నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు. రాష్ట్రంలో దొంగ ప్రచారాలు, దాడులు. బద్వేలు ఓటర్ల పై మాకు నమ్మకం ఉంది. ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయాలని వైసీపీ చూస్తుంది. వైసీపీ కి ఫ్యూజ్ లు లేకుండా చేస్తాం.