Suryaa.co.in

International National

ఉక్రెయిన్‌లో రంగంలోకి దిగిన సోనూసూద్ టీం

– భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఉక్రెయిన్-రష్యా మధ్య కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారత పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. కాగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇదే సమయంలో బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌కు సంబంధించిన టీం కూడా రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు తెలియపరుస్తోంది. అంతేకాకుండా భారత పౌరులు సురక్షితంగా ఉక్రెయిన్ వీడే విధంగా సహాయ సహకారాలు అందజేస్తోంది.

సోనూసూద్ టీం సూచనలు పాటిస్తూ సేఫ్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ సేఫ్‌గా ఉక్రెయిన్‌ను వీడింది. తనతోపాటు ఎంతో మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటపడినట్టు సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోనూసూద్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కరోనా సమయంలో కూడా ఎంతో మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చి రియల్ హీరోగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వేలాది మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది.

LEAVE A RESPONSE