త్వరలో కోవిడ్ కథ కంచికి

0
15

ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(హూ)నుంచి మంచి కబురు వినిపించింది..కోవిడ్ ఉత్పాతం మొదలైనప్పటి నుంచి కూడా శుభం పలకరా..అంటే ఇంకేదో అన్నట్టు ప్రపంచం తెరిపిన పడకుండా హెచ్చరికలు మాత్రమే జారీ చేస్తున్న హూ (W.H.O)
ఇప్పుడు చెప్పింది చల్లని కబురు..
కోవిడ్ అంతం ఇంకెంతో దూరంలో లేదు..
ప్రపంచవ్యాప్తంగా అందుతున్న సమాచారాన్ని క్రోడీకరించి..లోతైన విశ్లేషణలు చేస్తే తేలిన విషయం ఏమిటంటే పాండమిక్ ముగింపు కనుచూపు మేరలోనే ఉందట..గత వారం లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 2019 నుంచి చూస్తే అతి తక్కువగా ఉంది..ఇంచుమించు అన్ని దేశాలు కూడా కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల చూపిస్తున్నాయి.
ఇది అత్యంత సానుకూల పరిణామం..కొత్త వేరియంట్లు
కనిపించడం లేదు..ఉన్నవి ప్రమాదకరంగా లేవు..కోవిడ్ సంబంధ మందుల అమ్మకాలు పడిపోయాయి..
ఆస్పత్రుల్లో సాధారణ రోగులు మాత్రమే కనిపిస్తున్నారు..ప్రజల్లో ఆందోళన తగ్గి సాధారణ జీవితం గడుపుతున్నారు.
ప్రపంచం ఆనాటి భయంకర అనుభవాల నుంచి తేరుకుని మళ్లీ ఉరకలెత్తడం ప్రారంభించింది..
ఇంతకంటే శుభసూచకాలు ఇంకేముంటాయి.
అయితే ఇప్పుడున్న సానుకూల పరిస్థితులను ఆసరాగా చేసుకుని జనం కోవిడ్ మహమ్మారిని మరింత కట్టుదిట్టంగా అదుపు చేసే దిశగా అడుగులు వేయాలని ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
ఇంకొన్నాళ్ళ పాటు జాగ్రత్తలు పాటించవలసి ఉన్న దశలో కొన్ని దేశాల్లో అప్పుడే కొంత విచ్చలవిడితనం పొడసూపు తోందని..అది వాంఛనీయం కాదని హూ పేర్కొంది.ఇలా అయితే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది..
ఈ దశలో ప్రపంచం మరో వేవ్ తట్టుకోవడానికి సిద్ధంగా లేదు గనక ఇంకొంతకాలం 2020 నాటి జాగ్రత్తలు పాటిస్తే కరోనా పై పూర్తి విజయం సాధించి ప్రపంచం యధాపూర్వ జీవనాన్ని గడపవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

సురేష్ కుమార్ e
9948546286