-అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకురావడమే లక్ష్యం
-సిబ్బందికి రావాల్సిన బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తాం
-600 బస్సులలో అమలు వెహికల్ ట్రాకింగ్ యాప్
-టీఎస్ ఆర్టీసీ లో మరిన్ని సంస్కరణలు
-టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు, బాజిరెడ్డి గోవర్ధన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టిఎస్ ఆర్టిసి లో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నారు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో 2022 – 2023 రాబోవు ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాదిలో “ప్రగతి చక్రం పరుగులు” పెడుతోంది.. అటు సంస్కరణలు ఇటు ఆదాయం పెంపు కోసం, నష్ట నివారణకై ఆర్టీసీని గాడిన పెడుతున్న సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. అతి త్వరలోనే 300 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభిస్తాం ..టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకొనుటకు 30 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది.ఇటు ప్రయాణికులకు మరోవైపు సంస్థ సిబ్బందికి, అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సిబ్బంది – ప్రయాణికుల మన్ననలను పొందడం జరిగింది.
సంస్థ సిబ్బందికి రావాల్సిన బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తాం. సంస్థ సిబ్బందికి అన్ని విధంగా సహాయ సహకారాలు అందిస్తాము. సిబ్బంది పూర్తి విశ్వాసంతో సైనికుడిలా పనిచేసి సంస్థ నష్ట నివారణకు కృషి చేయాలి.టిఎస్ ఆర్టిసి తార్నాక ఆసుపత్రిలో సిబ్బంది కోసం మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. సంస్థ కోసం కృషి చేస్తున్నా మేనేజింగ్ డైరెక్టర్, వి సి సజ్జానార్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్స్, డిప్యూటీ రిజినల్ మేనేజర్స్, డిపో మేనేజర్, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ స్టాఫ్, సంస్థ సిబ్బందికి సంస్థ కోసం నాకు సహకరిస్తూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాభినందనలు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు సంస్థ గౌరవ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నుండి అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నూతనంగా మరిన్ని సంస్కరణలను అమలు చేయనున్నారు. సంస్థ నష్టాల్లో ఉన్నందున ఆయన జీతభత్యాలు కూడా సంస్థ కోసం వదులుకున్నారు.
టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఫాదర్స్ డే మరియు మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, జాతీయ పండగలను దృష్టిలో ఉంచుకొని పెద్దలకు ప్రత్యేక రాయితీలతో మరియు పిల్లలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి అన్ని ఆర్టీసీ డిపోలను లాభాల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో మరిన్ని నూతన సంస్కరణలను టీఎస్ ఆర్టీసీ సంస్థలో అమలు చేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అభివృద్ధికై అయన నిరంతరం కృషి చేస్తానన్నారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ చేపట్టిన, చేపట్టబోయే సంస్కరణలను ఆయన వివరించారు.
2021 – 2022 సంవత్సరంలో చేపట్టిన సంస్కరణలు ..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఆర్టీసీ బస్సులోనే 9.7.2022 నుండి తిరుపతికి TSRTC బస్సుతో పాటు దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.ప్రతిరోజు తిరుపతికి 1,000 మంది ప్రయాణికులను చేర్చడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో నూతనంగా ఆర్టీసీ మినీ సిటీ బస్ సర్వీసులు ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్రంలో నారాయణపేట జిల్లా కోస్గి లో నూతనంగా బస్ స్టేషన్ మరియు డిపోలను ప్రారంభించారు..మెదక్ జిల్లా నర్సాపూర్ లో నూతనంగా బస్టాండ్ మరియు బస్ డిపోలను ప్రారంభించుకోవడం జరిగింది.తార్నాక హాస్పిటల్ ప్రాంగణంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల, మరియు ఇంటర్ ఒకేషనల్ కళాశాల ను ప్రారంభించుకోవడం జరిగింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ QR కోడ్ ద్వారా TS RTCలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభించుకోవడం జరిగింది.దీనివల్ల చిల్లర కష్టాలు తొలగిపోయాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం టాయిలెట్లు ఉచితం గా చేయడం జరిగింది . మరియు TSRTC యొక్క అన్ని బస్ స్టేషన్లకు టాయిలెట్లు విస్తరిస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు. టీఎస్ ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని అధునాతన హంగులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చి దిద్దడం జరిగింది.
నూతనంగా ఇంటర్ ఒకేషనల్ కళాశాలను ప్రారంభించారు. నిరుపేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తార్నాక ఆసుపత్రిలో ఓ పి సర్వీసులను చైర్మన్ ప్రారంభించారు.తార్నాక ఆస్పత్రిలో 200 పడకల బెడ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. డయాలసిస్ పేషెంట్లకు నాలుగు బెడ్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.తార్నాక ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటును చైర్మన్ ప్రారంభించారు. ఐసీయూ 15 ఎమర్జెన్సీ 05 యూనిట్ లను ఏర్పాటు చేశారు.తార్నాక ఆసుపత్రిలో రెండు అంబులెన్సు సర్వీసులను చైర్మన్ ప్రారంభించారు.
ఆస్పత్రిలో 24 గంటల ఫార్మసీ సేవలు అందుబాటులో ఉన్నాయి.టిఎస్ ఆర్టిసి అన్ని బస్ స్టేషన్లలో MRP రేట్లకు వస్తువులను అమ్మే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.దీనికి సంస్థ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఎమ్మార్పీ రేట్లను అమలు చేస్తున్నారు.
ప్రయాణికుడు బస్సు ఎక్కడుంది అని తెలుసుకోవడం కోసం వెహికల్ ట్రాకింగ్ యాప్ 600 బస్సులలో అమలు చేయబడింది మరియు తక్కువ వ్యవధిలో అన్ని బస్సులలో అమలు చేయబడుతుంది.Twitter, Facebook, Instagram, YouTube వంటి సోషల్ మీడియాలో ప్రయాణికులు ఫిర్యాదులు అందించిన అనంతరం తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సలహాలు సందేహాల కోసం టి ఎస్ ఆర్ టి సి సంస్థ ఆధ్వర్యంలో 7.24×7 కాల్ సెంటర్ పని చేస్తోంది.
రాష్ట్రం నుండి ప్రతిరోజు తిరుపతి వెంకన్న వద్దకు 1000 TTD దర్శన టిక్కెట్లు అందించడం జరుగుతుంది, ఇప్పటివరకు 20783 దర్శన టిక్కెట్లు బుక్ చేయబడ్డాయి. హైదరాబాద్ జంట నగరాలలో కార్గో సేవలలో భాగంగా 44 పోస్టల్ పిన్ కోడ్స్ నెంబర్ల సహాయంతో డోర్ డెలివరీని ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా సమ్మక్క సారలమ్మ జాతరకు బంగారం, తలంబ్రాలు తరలించి భక్తుల మన్ననలను పొందడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో టీఎస్ ఆర్టీసీ బస్సులో జన్మించిన నవజాత శిశువులకు జీవితకాలం టి ఎస్ ఆర్టిసి బస్సులలో ఉచిత సర్వీసులను అందిస్తున్నాము.
I-TIMలు TSRTCలో ప్రవేశపెట్టబడ్డాయి. TSRTC ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ మరియు ICU యూనిట్ ప్రారంభించుకొని విజయవంతంగా సేవలను అందిస్తున్నాము. TSRTC వైపు ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడానికి కొన్ని సందర్భాలలో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కూడా అందించడం జరుగుతుంది.ఫాదర్స్ డే మదర్స్ డే చిల్డ్రన్స్ డే లను పురస్కరించుకొని పిల్లలతోపాటు తల్లిదండ్రులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని టీఎస్ ఆర్టీసీ సంస్థ అందిస్తోంది.
రాఖీ పండుగ రోజున అత్యధిక ఆదాయానికి కృషిచేసిన (20.10 కోట్లు) సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, సంస్థ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడిప్పుడే మన టీఎస్ ఆర్టీసీ డిపోలు నష్టాల నుండి లాభాలను ఆర్జిస్తున్నాయి.అన్ని డిపోలను లాభాల బాటలోకి ప్రయాణించేందుకు సంస్థ చైర్మన్ కృషి చేస్తున్నారు.
సామాజిక బాధ్యతలో భాగంగా TSRTC రక్తదాన శిబిరాలు నిర్వహించి 10000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకు స్వచ్ఛంద సేవా సంస్థలకు అందజేయడం జరిగింది. ఆన్‌లైన్ ద్వారా డిపో సిబ్బంది ద్వారా(వివాహాలు, ఫంక్షన్‌ల కోసం ప్రత్యేక అద్దె బస్సులను) బుక్ చేయడానికి ఎటువంటి డిపాజిట్ లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సేవలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది.
ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు సంస్థలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలను అందించడం జరుగుతుంది.భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలతో పాటు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది..
2022 – 2023 సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణలు ..
హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఒకటి, వరంగల్‌లో రెండు ఐటీఐ కాలేజీలు త్వరలో తరగతులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అతి త్వరలోనే ప్రయాణికులకు అనుగుణంగా 300 కొత్త ఎలక్ట్రికల్ బస్సులను సంస్థలో ప్రవేశపెట్టనున్నాము.. అతి త్వరలోనే 1200 ఉద్యోగాలు విడతలవారీగా కారుణ్య నియామకాలు చేపడుతాము .. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్ తో జీవ వాటర్ బాటిల్లను అతి త్వరలోనే ప్రారంభిస్తాము. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి అక్టోబర్ నెల జీతంతో పాటు ఒక డీఏను అందించడం జరుగుతుంది. అతి త్వరలోనే ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సూపర్ లగ్జరీ మరియు డీలక్స్ స్వీపర్ క్లాసెస్ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నాము. నష్టాల బాట నుండి లాభాల్లోకి ప్రయాణించేందుకు సంస్థ కోసం కృషి చేస్తున్నా మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జనార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్స్, డిప్యూటీ రిజినల్ మేనేజర్స్, డిపో మేనేజర్, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ స్టాఫ్, సంస్థ సిబ్బందికి సంస్థ కోసం నాకు సహకరిస్తూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాభినందనలు.