ఈ వార్త చదివి గట్టిగా నినదించకండి. ఎందుకంటే మిమ్మల్ని హిందూ మతోన్మాద శక్తి గా లెక్క గడతారు…
మరీ ఎక్కువ బాధ పడకండి.
ఎందుకంటే మీలో దాగి ఉన్న మనువాదం మీతో అలా పలికించేలా చేసింది అంటూ మిమ్మల్ని మాటలతో వెంటాడి వేటాడి చంపేయగలరు… లావణ్య మృతికి కారణం అయిన వారిని ఉరి తీయమని అసలు డిమాండ్ చేయొద్దు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన సెక్యూలర్ ఫాబ్రిక్ ఫర్రున చిరిగి పోగలదు….దేశ హితం కోరే వారు అయితే జస్ట్ కుమిలి కుమిలి ఏడ్చుకోండి… లావణ్య కోసం ఒక కన్నీటి చుక్క విడవండి…. ఆ అమాయకపు అమ్మాయి శరీరాన్ని పెస్టిసైడ్ ముక్కలుగా నరికిన ఆ బాధా క్షణాలను గుర్తుకు చేసుకుని, ఇంకో లావణ్య ఇలా తనువు చాలించొద్దని, ‘నీ’ దేవుడిని కాకుండా ‘ వేరే’ దేవుడిని ప్రార్థించండి.
జర్నలిస్టులైన మేము ఇలాంటి వార్తలకు ప్రాముఖ్యం ఇస్తే ఒక వర్గానికి కొమ్ము కాసే వారం అవుతాం. అంతే కాదు ఈ వార్త గురుంచి ఎక్కువ రాస్తే, ప్రగతి నిరోధక శక్తిగా, మూఢ భక్తి తో తూగుతున్న వ్యక్తిగా బ్రాండ్ వేస్తారు. లావణ్య (ఆత్మ) హత్య ను విశ్లేషణగా రాస్తే మాలాంటి జర్నలిస్టులు హేతువాదనికి, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కి వ్యతిరేకం అవుతాం కదా. మేము జర్నలిస్టులం ఏమి చేస్తామంటే ఒక మూల మామూలు క్రైమ్ వార్త లాగా రాస్తాం…’ ఇంకో ‘ రకమైన వార్త దొరికింది అంటే అది ఉత్తర్ ప్రదేశో, బీహారో ఎక్కడ జరిగినా సరే….హిందూ…బ్రహ్మణికల్… కుల.. ఉన్మాద శక్తులు .. సంస్థలు అంటూ కసి తీరా తిడుతూ ….అపర ‘మేధావులను’ సెల్ఫ్ మేడ్ ‘సైంటిస్టులు’ ప్రొఫెసర్లను పెట్టి ఒక వారం రోజులు కుమ్మితే కానీ మాలోని అభ్యుదయవాదం తనివి తీరదు.
ఇంతకీ ఎవరీ లావణ్య?
పేదింట పెరిగిన లావణ్య తమిళనాడు తంజావూరు లో సాక్రెడ్ హార్ట్ అనే కాలేజీలో ఇంటర్ చదువుతోంది. లావణ్య తండ్రి ఒక పేద రైతు. అదే ఊరిలో , కాలేజీకి దాదాపుగా అనుబంధంగా ఉండే St. Michael బోర్డింగ్ హాస్టల్ వార్డెన్ లావణ్య ఇంటికి వెళ్లి చెప్పింది…
హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి మారండి , పిల్ల చదువు ఖర్చు అంతా తమదే అని . ఇది జరిగి రెండు ఏళ్ళు అయ్యింది. ఎందుకో కానీ వారు మతం మారలేదు. లావణ్య పై కూడా విపరీతమైన వత్తిడి. లొంగలేదు. వెంటనే ఎక్కడో మండింది వార్డెన్ కు. ప్రతి రోజు టాయిలెట్స్ శుభ్రం చేయించడం దగ్గర నుంచి అన్ని పనులు చేపించేవారు. హింసించే వారు. ఇక తనవల్ల కాదు అనుకుంది. క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించింది…
చెప్పాను కదా… దీనిపై ఇంతకంటే ఏం మాట్లాడుతాం. స్కూల్ లో , గుడి దగ్గరో , ఏదైనా ఊరిలోనే ఇలాంటి మత మార్పిడి అంశం పై ఆందోళన చేస్తే కొన్ని సందర్భాల్లో ఉల్టా ఆందోళనకారులపైనే
ஏழை விவசாயி மகள் லாவண்யா வயது 27, அரியலூர் தூய இருதய மேல்நிலைப்பள்ளியில் நன்றாகப் படிக்கும், பன்னிரண்டாம் வகுப்பு மாணவி.
இவரை மதம் மாறச் சொல்லி, பள்ளியில் கொடுத்த மன அழுத்தத்தால், விஷம் அருந்தி தற்கொலை செய்து கொண்டுள்ளார். pic.twitter.com/7dDioLpIJE
— K.Annamalai (@annamalai_k) January 20, 2022
కేసులు.ఏమంటే శాంతి భద్రతలకు RSS VHP ముసుగులో సంఘవిద్రోహ శక్తులు పనిచేస్తున్నాయని దబాయింపు. అందుకే అనాలి అనిపించింది. ఎక్కువ మాట్లాడకండి. కేవలం ఒక కన్నీటి చుక్క విడవండి ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని.
– పగుడాకుల బాలస్వామి
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు