Suryaa.co.in

Features

మనువును ప్రపంచానికి పరిచయం చేసింది సెక్యులర్లే!

15 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచానికి తెలియని మనువును ప్రపంచానికి పరిచయం చేసింది సెక్యులర్లు. పురాణమంతా పుక్కిటి పురాణ మంటూ..పురాణాలకంటే ముందున్న మనుస్మృతి మాత్రం సత్యమన్నది సెక్యులరిజం.
సృష్టినిర్మాణానికి ముందే పుట్టిన మనుస్మృతి మాత్రం నిజం .. కానీ సృష్టి అప్పటికి నిర్మాణమే కాలేదని చెక్కకు మేక్కొట్టి మరీ చెప్పింది ఛందస్సు లేని చాదస్తం.
బృహస్పతి గ్రహం .. గ్రహం కు జ్ఞానమేమిటి గ్రహాలకు ప్రాణమేమిటి వాటికి మానవ లక్షణాలేంటి అని శాస్త్రాన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేసిన నాస్తిక మాఫియా .. బృహస్పతితో చర్చించిన మనువు కల్పితం … కానీ… మనుస్మృతి నిజమన్నది.
జంతుబలి బ్రాహ్మణ్యం.. హింస బ్రాహ్మణ్యం అన్నది సెక్యులరిజం ..మళ్ళీ బ్రాహ్మణుడు మాంసాహారం ముట్టక పోవటం విశాల సమాజాన్ని అవమానించటమే .. జీవహింసలోనే గౌరవం అంది సెక్యులరిజం. ఆర్యులు విదేశీయులన్నది సెక్యులరిజం.. ఆధారాలేంటంటే భోరు మన్నది .. ఆర్యులెక్కడినుండివచ్చారో
manu1 అక్కడ వాళ్ళు అప్పటికి సంస్కృతం మాట్లాడే వాళ్ళా అని అడిగితే ..ఠాట్ అప్పటికి అక్కడ బట్టకట్టటం రాకపోతే మాటలెలా వస్తాయన్నది.

పర్షియన్లు స పలుక లేక సింధును హిందూ అన్నారన్న సెక్యూలరిస్టుల్ని .. పర్షియన్ పేరులో వున్న “స” ఎలాపలికారు , ఇస్లాం లో “స” ఎలా పలికారు .. వారి రాజ వంశాలన్నిటిలో వున్న “స” ఎలా పలికారయ్యా అంటే .. వారి జిహ్వాగ్రము నుండి భేదులయ్యాయ్.
మనుస్మృతి పుట్టే నాటికి ఈ బీడు సిద్హాంతాల బుక్కు లో సృష్టే పుట్టలేదు .. కానీ ఈ బుద్ధిహీనులు మనుస్మృతి పేరుచెప్పి మతం మారుస్తారు .. సృష్టి పుట్టుకకంటే ముందు ఆ బుక్కు ఎలా పుట్టిందయ్యా .. మీ బుక్కు సృష్టే లేదంది కదా అని బుక్ చేసేవాడు లేక.

కులమో కులమో అంటూ హిందూత్వం వైపు వేళ్ళు చూపించే కుంకల్ని .. అయ్యా స్వాయంభువ మనువు, వైవస్వత మనువు.. దితి అదితి, ఆదిత్య, వామన ,, కర్ణ ,.. రామ.. కుబేర .. ఇలా వొకే కుటుంబం లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులెలా వున్నారయ్యా .. మరి కులమెక్కడ అంటే చెప్పలేక కుళ్లుకు చస్తారు.
ఏడువందల ఏళ్లపాటు హిందువులను, ప్రత్యేకంగా బ్రాహణులను ఊచకోత కోసిన ఇస్లాం , 300 ఏళ్ల పాటు శాస్త్రం పై పై విషం నూరిన “పాలిస్టర్ చడ్డీ లేసుకొనే పాచి గజ్జల సమాజం” .. కంటే లక్షల సంవత్సరాల నాటి ఎవరికీ తెలీని మనుస్మృతి ప్రభావం చూపించిందా..?

ఈ మ్లేచ్ఛ సంచారం భారత దేశం లో జరగక ముందు .. భారత దేశానికి అలవాటు లేని, తెలియనివి నాలుగు పదాలు 1. అత్యాచారం, 2. వివక్ష, 3. బానిసత్వం 4. లంచం . అత్యాచారానికి ప్రయత్నించిన కీచకుడు తరాలు తిట్టుకొనే నీచుడయ్యాడు. అత్యాచారమనే ఆలోచన కంటే ఇంకా చిన్నదైన పరపురుషుని భార్యను అపహరించిన రావణుడు రాక్షసుడయ్యాడు .. అసలు ఆ ఊహే మనకు తట్టదు .. సరే .. మొన్ననే ఎవరో బిషప్ .. ఈ కేసులో నుండి బయటకొచ్చాడు.
మనిషే మాధవుడు అనే హిందూత్వానికి మనుషులంతా పాపులే అంటూ .. ఆ పాపుల్లో కూడా దైవజనులు గొప్పవారని వివక్ష తెచ్చారు .. రాజ్యం గెలిస్తే ఓడిన వారిని బానిసలు గా చేసుకొనే మత సాంప్రదాయం హిందూత్వంలో లేదు.

మనుస్మృతి యాత్రనార్యన్తు పూజ్యంతే .. స్త్రీలు పూజింపబడ్డ చోట దేవతలు ఆనందిస్తారు అని చెప్పింది కానీ వంద డాలర్లకు , రెండువందల డాలర్లకు మహిళకు ముసుగులేసి గొలుసులేసి అమ్మమనీ చెప్పలేదు .. అత్యాచారామె ఆచారమనీ చెప్పలేదు.. అత్యాచారుల్ని దైవజనుల్ని చేయలేదు ..
స్త్రీలు చదువుకున్నారు .. స్త్రీలకు పౌరసత్వం లేని దేశం బానిసలు , గుడ్డలు మార్చినట్లు వాడు వద్దు వద్దు వద్దు అనగానే తెగిపోయే ఎగతాళిక సాంప్రదాయం కాదు మనది .. తాళి విలువ తెలిసి కాళి అర్చకులం.
ఒక్క విషయం వాస్తవం .. ఒకనాడు ఆసియా ఖండమంతా మనుస్మృతే .. హిందూత్వమే .. ఆ మనుస్మృతి లేని ఆఫ్ఘన్, పాక్ , ఎడారి రాజ్యాలలో స్త్రీల బ్రతుకులేమిటో చూస్తున్నాం కదా.. ఆ మనుస్మృతే .. అదే భారత స్త్రీలకూ రక్షణ.. అత్యాచారం అనే అనాగరికత.. ట్రిపుల్ తలాక్ అనే దురాచారం నుండి రక్షణ ఇచ్చింది మనుస్మృతే.

– రవిశంకర్

LEAVE A RESPONSE