Suryaa.co.in

Telangana

నేడు రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు

-నేడు, రేపు కొన్ని చోట్ల వానలు

హైదరాబాద్‌‌ రాష్ట్రంలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే చాన్స్‌‌ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో సోమ,మంగళవారాల్లో ఉరుములు,మెరుపులతో వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణతో పాటు కొంకణ్‌‌, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీలో రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.టీఎస్‌‌ డీపీఎస్‌‌ డేటా ప్రకారం.. మంచిర్యాలలోని లింగాపూర్‌‌లో 8.7 సెంటీ మీటర్లు, కామారెడ్డిలోని మెనూర్‌‌లో 8.6 సెం.మీ, మంచిర్యాలలోని వెల్గనూరు, జగిత్యాలలోని సిరికొండలో 8.4 సెం.మీ, కరీంనగర్‌‌లోని రేణికుంటలో 7 సెం.మీ, హన్మకొండలోని ఐనవోలులో 6.7 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. ఎండలు తగ్గుముఖం పడుతున్నాయి. టెంపరేచర్​ 41 డిగ్రీలకు పడిపోయింది..

LEAVE A RESPONSE