శ్రీకాకుళం, అక్టోబర్ 26: శ్రీకాకుళం జిల్లా సమీక్షా మండలి సమావేశం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వర రావు (నాని) అధ్యక్షతన మంగళవారం జరిగింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియ విజయ, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్ర శేఖర రావు, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, పాకలపాటి రఘు వర్మ, శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, గొర్లే కిరణ్ కుమార్, కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పెరాడ తిలక్, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వర రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు డా.ఎస్.వి.నేతాజీ,జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఎ పిఓ బి.నవ్య, టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మత్,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.