Suryaa.co.in

Andhra Pradesh Telangana

బొత్స చూసి రాసి పాసయి ఉంటారు

-తెలంగాణ విద్యా వ్యవస్థను, విద్యార్థులను బొత్స తీవ్రంగా అవమానించారు
– ఏపీలో కులాల పిచ్చి, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం అని మేము ఎప్పుడైనా అన్నమా?
– ముందు మీ మూతి మీరు కడుక్కోండి
– తిరుమలలో వైసీపీ ప్రభుత్వం వివక్ష
– రాష్ట్రం విడిపోవడానికి బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులే కారణం
– మంత్రులు- ఎమ్మెల్యేల ఇంజినీరింగ్ కాలేజీలకు తాళాలు వేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిది
– అభివృద్ధి పై చర్చకు బొత్స హైదరాబాద్ వచ్చినా సరే… నన్ను విజయవాడ రమన్నా సరే
– మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ విద్యా వ్యవస్థను, విద్యార్థులను బొత్స సత్యనారాయణ తీవ్రంగా అవమానించారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షలు చూసి రాసారు కాబట్టి అలాంటి కామెంట్స్ చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతో ఆంధ్ర మంత్రులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంధ్రప్రదేశ్ నాయకులు మీ మూతి మీరు కడుక్కోండనీ సూచించారు.

పోటీ పరీక్షల్లో ఏపీ రాజధాని ఏంటని అడిగితే సమాధానం రాయలేని పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ విద్యార్థులతో …ఏపీ విద్యార్థులను తీసుకొచ్చి పోటీ పరీక్షలు పెడితే టాలెంట్ బయటపడుతుందన్నారు. APPSC లో ఆనాడు స్కామ్స్ చేసిన చరిత్ర వాళ్ళది…డబ్బుల కట్టలతో లాడ్జ్ లన్ని నిండేవనీ ఆరోపించారు. తెలంగాణ లో నిబంధనలు , మౌలిక సదుపాయాల లేని మంత్రులు- ఎమ్మెల్యేల ఇంజినీరింగ్ కాలేజీలకు తాళాలు వేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిది వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కారణం బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులే కారణమన్నారు. రెండూ ప్రాంతాల ప్రజలను సమానంగా చూస్తే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. తిరుమలలో వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తూ భక్తులను ఇబ్బంది పెడుతోందనీ ఆరోపించారు.

అభివృద్ధి పై బొత్స సత్యనారాయణ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నంచారు.ఏపీలో కులాల పిచ్చి, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం అని మేము ఎప్పుడైనా అన్నమా? పేర్కొన్నారు. నన్ను రమ్మంటే వస్తా…నేను విజయవాడ కనకదుర్గమ్మ, తిరుపతి లలో ఎక్కడైనా చర్చకు రెడీ వెల్లడించారు . వోక్స్ వాగన్ లాంటి స్కాం లు గతంలో జరిగాయి…అవే స్కామ్ లు ఇప్పటికీ జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నరేమో? ప్రశ్నించారు.

తెలంగాణ విద్యా వ్యవస్థను, విద్యార్థులను బొత్స సత్యనారాయణ అవమానించారనీ ఆరోపించారు. అభివృద్ధి పై చర్చకు బొత్స సత్యనారాయణ హైదరాబాద్ వచ్చినా సరే- నన్ను విజయవాడ రమన్నా సరే చర్చించటానికి సిద్దమని వెల్లడించారు.

LEAVE A RESPONSE