ఎమ్మెల్యే గా పోటీ చేయకుండా ఉండటానికి నేనేమైన సన్యాసినా?

Spread the love

– ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇంట్లో ఉత్తిగా కూర్చోవాలంటే కాళ్లు ఆగటం లేదు
– ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుండైన పోటీకి సిద్ధం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశిస్తే ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడి నుండి అనేది కెసిఆర్ చెప్తారు.కెసిఆర్ ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి. ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని అంతకంటే ఎక్కువగా ఉంది.ఎమ్మెల్యే గా పోటీ చేయకుండా ఉండటానికి నేనేమైన సన్యాసినా?ఆలేరు నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యే గా గెలిచాను. ఏ పార్టీ అవకాశం ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా గెలిపించారు ఆలేరు ప్రజలు.కెసిఆర్ ఆలేరు నుండి ఎవ్వరికీ అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇంట్లో ఉత్తిగా కూర్చోవాలంటే కాళ్లు ఆగటం లేదు ఆలేరు ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది.

Leave a Reply