గుంటూరు : శ్రీశైలం దేవాలయానికి వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు అన్నారు. శ్రీశైలం బోర్డు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంతూరు ఇప్పటంకు బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకటసుబ్బారావు(బీఎస్ఆర్)తో కలిసి శంకరశెట్టి పిచ్చయ్య మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇప్పటంలో భారీ ర్యాలీతో పాటు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందరభంగా పిచ్చయ్య మాట్లాడుతూ 42 ఏళ్ళపాటు తెలుగుదేశం పార్టీకి సేవలు చేయడం ద్వారా వచ్చిన ఈ కీలకమైన పదవికి వన్నె తెస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.