– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
గురజాల : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు శుభపరిణామం… ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖకు గూగుల్‌ను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చనున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా సీఎం చంద్రబాబు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ సంస్థను విశాఖకు తీసుకువస్తున్నారన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించి, ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చంద్రబాబు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తున్నాయి. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచేలా ఉంది. దేశంలోనే అత్యుత్తమమైన 26 పాలసీలను రూపొందించి సంస్థల నిర్మాణానికి వేగంగా అనుమతులు, భూముల కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అందిస్తుందని తెలిపారు.