– ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్
శ్రీశైల దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ధర్మకర్తలమండలిని నియామకం చేసింది. ఈ మేరకు రాష్ట్రపభుత్వం జీ.ఓ. ఆర్టినెం. 1237, తేది: 10.10.2025 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
దేవదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి నూతన ధర్మకర్తల మండలి చేత అసిస్టెంట్ కమిషనర్, సహాయ కార్యనిర్వహణాధికారి ఇ. చంద్రశేఖరరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు డా. వి. పార్థసారధి విచ్చేశారు.
చంద్రావతి కల్యాణమండపంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమములో నియామకం కాబడిన అధ్యక్షులు, సభ్యులను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయ కార్యనిర్వహణాధికారి వారు ముందుగా స్వాగతించారు.
అనంతరం అధ్యక్షులుగా నియామకం కాబడిన పి. రమేష్‌నాయుడు ముందుగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత సభ్యులు వరుసగా, ఏ.వి. రమణ, బి. రవణమ్మ, జి. లక్ష్మీశ్వరి, కె. కాంతివర్ధిని, ఎస్. పిచ్చయ్య, జె. రేఖాగౌడ్, ఎ. అనిల్‌కుమార్, డి. వెంకటేశ్వర్లు, బి. వెంకటసుబ్బారావు, సి.హెచ్. కాశీనాథ్, యం. మురళీధర్, యు. సుబ్బలక్ష్మీ, పి.యు. శివమ్మ, జి.శ్రీదేవి చేత అసిస్టెంట్ కమీషనర్ మరియు సహాయ కార్యనిర్వహణాధికారి వారు ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా ధర్మకర్తల మండలి లో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన పలువురు సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అనంతరం సభ్యులందరికీ వేదాశీర్వచనముతో పాటు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు మరియు జ్ఞాపిక అందజేయబడ్డాయి. ఈ సత్కార కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.