(చాకిరేవు)
మొన్నటిదాకా గుమ్మడికాయ దొంగలా భుజాలు తడుముకున్నావ్! ‘నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది’ అని ఏదేదో డైలాగులు కొట్టావ్ కదా. నీతిమంతుడిలాగా, అపరిచితుడిలా యాక్టింగ్ చేశావ్! కానీ ఇప్పుడు చూడు, కసాయి కోడి మెడ మీద కత్తి పడ్డట్టు నిందితుడే నీ పేరు కక్కాడు!
ఇబ్రహీంపట్నంలో కిడ్నీ సమస్యల గురించి ఎగిరెగిరి పడ్డావు, ‘ఫ్లై యాష్’ వల్లనంటూ ఓ పెద్ద పోరాటం డ్రామా చేశావ్. ఉద్దానంలా మారిందని ఓవర్ యాక్టింగ్ చేశావు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఫ్యాక్టరీల మీదకు తోసేశావ్. సిగ్గు లేదా?
ఆ ప్రాంతంలో కిడ్నీలు పట్టుకు కూర్చోవడానికి అసలు కారణం నువ్వు జనాలకు అమ్మించిన నీ నకిలీ లిక్కర్ కాదా? ఏమాత్రం కామన్సెన్స్ ఉన్నోడికైనా తెలుస్తుంది. నకిలీ లిక్కర్ విషం ఎంత ప్రమాదకరమో! నీ అడ్డమైన దందాలకి నువ్వు పుట్టిన ఇబ్రహీంపట్నం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టావు కదా!
‘జనార్దన్ రావు’ అనే నిందితుడు తాజాగా చెప్పిన మాటలతో నీ ముసుగు పూర్తిగా తొలగిపోయింది! వైసీపీ పాలనలో నీ ఆధ్వర్యంలోనే నకిలీ లిక్కర్ తయారైంది అని వాడు తేల్చి చెప్పేశాడు!
కూటమి ప్రభుత్వం రాగానే భయపడి తయారీ ఆపేశావట!
మళ్ళీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి ఏప్రిల్లో ఫోన్ చేసి ‘నకిలీ లిక్కర్ తయారు చెయ్యి’ అని చెప్పావట!
ముందు ఇబ్రహీంపట్నంలో పెట్టి, తర్వాత చంద్రబాబుపైకి నెట్టడానికి తంబళ్లపల్లెకు మార్చమని నువ్వే ఆదేశాలు ఇచ్చావట! ఛీ! ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా?
జనాల్ని మాయ చేసి, కూటమి ప్రభుత్వంపైకి నెట్టి, ఏదో కోర్టు బెయిల్ తెచ్చుకుని సమాజంలో మళ్ళీ పెద్ద మనిషిలా చలామణి అవ్వాలని చూస్తున్నావా?
కోర్టు, జప్తుల్లో వున్న అగ్రి గోల్డ్ ఆస్తులను కూడా లేఔట్లు వేసి అమ్మేసినవి, నీ దందాలు.. నీ క్రిమినల్ తెలివితేటలు అన్నీ అందరికీ తెలుసు.
జోగి రమేష్, నీ నకిలీ ముఖానికి, నకిలీ లిక్కర్ పాపాలకి త్వరలోనే చిప్పకూడు తినే రోజులు వచ్చాయి. సిద్ధంగా వుండు!