ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ హబ్‌-2

దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ హబ్‌-2 ప్రారంభానికి ముస్తాబవుతున్నది.మాదాపూర్‌ రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా ఖ్యాతి పొందనున్నది.తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌-2ను అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించింది.ప్రత్యేక అధునాతన వసతులు కల్పించిన టీ హబ్‌-2ను ఈ నెల 28న ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రారంభించనున్నారు.

Leave a Reply