టీడీపీ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డీఎస్పీ పై రాష్ట్ర డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి
– ట్విట్టర్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులపై ఇంత దారుణంగా హింసకు తెగబడతారా? డీజీపీ గారు, ఇది ఇంకా మీ దృష్టి కి రాలేదా? ఆ డీఎస్పీపై మీరు చర్యలు తీసుకుంటారా? లేదా? ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అని ఏపీలో అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడు కొందరు పోలీసు అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. అటువంటి అధికారులను సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత మీపైన ఉంది.ఈ ఘ టనకు బాధ్యులు అయిన అధికారులపై మీరు వెంటనే చర్య తీసుకోని పక్షంలో దీనిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తాము.