జగన్ పాలనలో చంద్రబాబు ప్రాణానికి ముప్పు

-ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుపై దాడికి వైసీపీ యత్నం
-వైసీపీ ఆగడాలను వెనకేసుకొస్తున్న డీజీపీ
-వైసీపీ దాడులతో రక్తంతో తడుస్తున్న టీడీపీ జెండాలు
-హింసను ప్రేరేపిస్తున్న జగన్ రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు
– నిమ్మల రామానాయుడు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నాటి నుండి చంద్రబాబుపై వైసీపీ మూకలు అనేకసార్లు దాడికి దిగాయి. 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంపై ప్రస్తుత మంత్రి జోగి రమేష్ రెండు, మూడు చెక్ పోస్టులను దాటి తన అనుచరులతో దాడికి ప్రయత్నం చేశారు. అమరావతి పర్యటనకు వెళితే చంద్రబాబు బస్సుపై చెప్పులు, కర్రలు, లాఠీలు విసిరిన వైసీపీ మూకలకు డీజీపీ వంత పాడారు. పల్నాడు పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ కాన్వాయ్ పై వైసీపీ మూకలు దాడిచేస్తే దానినీ పోలీసులు వెనకేసుకొచ్చారు. దేవాలయం వంటి పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరిమూకలు ముప్పేట దాడికి తెగబడితే పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

నేడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేస్తుంటే చంద్రబాబుపై వైసీపీ మూకలు దాడిచేయడానికి ప్రయత్నం చేశారు. ఈ దాడులన్నీ చూస్తుంటే జగన్ రెడ్డి తన అధికార దాహంతో చంద్రబాబును అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సొంత బాబాయ్ ను చంపిన వ్యక్తి, సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసిన వ్యక్తి కన్ను నేడు చంద్రబాబుపై పడింది. జగన్ రెడ్డి సొంతంగా చేయించుకున్న సర్వేల్లో వైసీపీ రానున్న ఎన్నికల్లో భారీ ఓటమిని మూటకట్టుకోబోతుందని తేటతెల్లమైంది. దీంతో పిచ్చిపట్టిన జగన్ రెడ్డి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదనే దురుద్దేశంతో, ప్రతిపక్ష నాయకుడిపపై దాడులు చేసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదవాడికి మూడుపూటలా పట్టెడన్నం పెడదామని ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పై వైసీపీ దాడిచేయడం సిగ్గుమాలిన చర్య. జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తులు గనుకనే అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసేలా వ్యూహరచన చేశారు.

కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై రాయి విసిరితే రూ.50వేలు, దాడిచేస్తే లక్ష రూపాయలు అంటూ సుపారీని జగన్ రెడ్డి ప్రకటించారు. ప్రశాంతంగా ఉన్న కుప్పం ను జగన్ రెడ్డి ఫ్యాక్షన్ కు అడ్డగా నిలిచిన పులివెందులలా తయారుచేస్తున్నారు. ఈ విధంగా హింసను ప్రేరేపిస్తున్న జగన్ రెడ్డి మరోక్షణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదు. రాష్ట్రంలో ఇంత అరాచకం, ఇంత హింస జరుగుతున్నా డీజీపీ మాట్లాడకుండా మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు డీజీపీ ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీస్)లో పనిచేస్తున్నారా? ఐజేఎస్(ఇండియన్ జగన్ సర్వీస్)లో పనిచేస్తున్నారా? అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి ఉన్మాద పరిపాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్దులై ఉన్నారు. దీనికోసం ఎన్ని కేసులు ఎదుర్కోవడానికైనా, జైళ్లకు వెళ్లడానికైనా వెనకడుగువేసే పరిస్థితి లేదని డీజీపీని హెచ్చరిస్తున్నాం.

ఈ రాష్ట్రంలో అధికారపక్షానికి ఒక రాజ్యాంగం, ప్రతిపక్షానికి ఒక రాజ్యాంగం, సామాన్యులకు ఒక రాజ్యాంగం ఇలా రకరకాలుగా రాజ్యాంగం అమలవుతోంది, దీనికి పోలీసు వ్యవస్థ వంతపాడుతోంది. ముఖ్యమంత్రి పెడన పర్యటనకు వెళితే పెడన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు, చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా అక్కడున్న వైసీపీ నాయకులను ఎందుకు హౌస్ అరెస్టు చేయలేదో డీజీపీ నోరువిప్పాలి. కుప్పంలో వైసీపీ దాడులతో టీడీపీ జెండాలు రక్తంతో తడిసిముద్దవుతున్నాయి. అయినా సరే ఇటువంటి దాడులకు టీడీపీ కార్యకర్తలు ఎవరూ బెదిరే పరిస్థితి లేదు. టీడీపీ ఎప్పుడూ కూడ ముందుగా కర్ర ఎత్తే పరిస్థితి ఉండదు, అలాగే కర్ర ఎత్తి తిరగబడిన వారి తాటతీయకుండా కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. కుప్పంలో రెచ్చిపోతున్న వైసీపీ అల్లరి మూకలు రానున్న కాలంలో అంతకంతకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ అల్లరి మూకలకు వంత పాడుతున్న ఏ స్థాయి అధికారులనైనా కోర్టు బోనులో నిలబెట్టడం తప్పదు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఉన్మాద పరిపాలన నుండి కాపాడుకుంటాం’’ అన్నారు.

Leave a Reply